Begin typing your search above and press return to search.

డిజాస్టర్ టాక్.. కానీ 100 కోట్లు వచ్చే

అలాగే మొదటి రోజు ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో డిజాస్టర్ అనుకున్నారు. కానీ తరువాత మెల్లగా పుంజుకుంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:01 AM GMT
డిజాస్టర్ టాక్.. కానీ 100 కోట్లు వచ్చే
X

బాలీవుడ్ గత కొన్నేళ్ల నుంచి సినిమాల సక్సెస్ రేట్ గణనీయంగా పడిపోయింది. వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తోన్న హిట్ అయ్యేవి సింగిల్ డిజిట్ లోనే ఉంటున్నాయి. ట్రెండ్ అంటూ కథలలో ఒరిజినాలిటీ లేకుండా మూవీస్ చేస్తూ ఉండటం వలన ఈ ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్, సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌత్ సినిమాల ఆధిపత్యం రోజు రోజుకి పెరుగుతోంది.

ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ఈ చిత్రానికి రాలేదు. ఇక షాహిద్ కపూర్, కృతి సనన్ కాంబినేషన్ లో 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా' మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. ఈ మూవీకి క్రిటిక్స్ అయితే దారుణమైన రివ్యూలు ఇచ్చారు.

అలాగే మొదటి రోజు ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో డిజాస్టర్ అనుకున్నారు. కానీ తరువాత మెల్లగా పుంజుకుంది. 10 రోజుల్లో ఈ మూవీ 108 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అందులో 62 కోట్ల షేర్ ఉంది. లాంగ్ రన్ లో 150 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ కి చెప్పుకోదగ్గ సినిమాలు హిందీలో లేకపోవడంతో ఈ సినిమాకి కలిసొస్తుంది. అలాగే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యిందని టాక్.

కృతి సనన్ మిమి తర్వాత ఏకంగా ఏడు డిజాస్టర్ లని తన ఖాతాలో వేసుకుంది. బచ్చన్ పాండే నుంచి ఆదిపురుష్ వరకు ఒక్క హిట్ పడలేదు. ఇప్పుడు తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా మూవీతో మళ్ళీ ఆమెకి ఒక హిట్ పడినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కి కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేవు. ఈ మూవీతో మళ్ళీ బ్యాక్ టూ ఫామ్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు.

డివైడ్ టాక్ తో స్టార్ట్ అయిన కూడా ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా కొంత ఉపశమనం అందించింది. ఫైటర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయిన చోట చిన్న సినిమాగా వచ్చి తెరి బాటన్ మే ఐసా ఉల్జా జియా నిలబడింది.