Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : జంటని విడదీసిన బిగ్ బాస్.. షాకింగ్ ఎలిమినేషన్..!

బిగ్ బాస్ సీజన్ 7లో భాగంగా 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఈరోజు జరుగుతుంది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 5:11 AM GMT
బిగ్ బాస్ 7 : జంటని విడదీసిన బిగ్ బాస్.. షాకింగ్ ఎలిమినేషన్..!
X

బిగ్ బాస్ సీజన్ 7లో భాగంగా 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఈరోజు జరుగుతుంది. ప్రతి సోమవారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు హౌస్ మెట్స్ కొందరిని నామినేట్ చేయడం వారిలో ఎవరు ఉండాలి ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లాలి అన్నది ఆడియన్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో లాస్ట్ వీక్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో వచ్చారు. అమర్ దీప్, రతిక, బోలే శావలి, శోభా శెట్టి, ప్రియాంక, అర్జున్, శివాజి, తేజ నామినేషన్స్ లో ఉన్నారు.

వీరిలో ఈ వారం తేజ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ లీక్స్ లో భాగంగా ఈరోజు తేజ హౌస్ నుంచి బయటకు వెళ్తున్నట్టు లీకైంది. టేస్టీ తేజా అంటూ యూట్యూబర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన తేజ తన కామెడీతో 9 వారాలు హౌస్ లో ఉంటూ వచ్చాడు. అయితే శోభా శెట్టితో అతను చేస్తున్న కామెడీ అంతగా వర్క్ అవుట్ అవలేదు. హౌస్ లో శోభా మీద ఎఫెక్షన్ చూపిస్తున్న తేజ ఆటలో కూడా అంత సీరియస్ గా అనిపించలేదు. బిగ్ బాస్ హౌస్ లో జంటగా ఉంటున్న తేజ శోభా శెట్టిలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నామని భావించారు. కానీ వీరి జోడీ అంతగా ఆడియన్స్ ని అలరించలేదు. తేజ విషయంలో శోభా చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా కంటెంట్ కోసమే అన్నట్టుగా అనిపించాయి. తేజ ఎలిమినేషన్ తో వీరి జోడీ విడిపోయింది.

శోభా శెట్టి విషయంలో చాలా కన్విన్స్ గా ఉంటున్న తేజ మిగతా వారి విషయంలో కూడా అంత సీరియస్ గా ఉండట్లేదు. అయితే తేజ తెలివైన వాడే కానీ కొన్ని సందర్భాల్లో అతను అతి తెలివి ప్రదర్శిస్తాడని కంటెస్టెంట్స్ కి తెలిసిపోయింది. ఈ వారం అతన్ని నామినేషన్స్ లోకి శివాజి తెచ్చాడు. అతను నామినేట్ చేయడం వల్లే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. మొత్తానికి తేజ ఎలిమినేషన్ మిగతా హౌస్ మెట్స్ కి పెద్దగా షాక్ ఇవ్వకపోయినా హౌస్ లో ఒక మంచి ఎంటర్టైనర్ మిస్ అవుతాడని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో భాగంగా తేజ ఈ వారం బయటకు వస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో ఆట మరింత రసవత్తరంగా మారనుంది. అందుకే ఇక మీదట సిల్లీ రీజన్స్ తో నామినేషన్స్ కాకుండా మంచి రీజన్స్ తో నామినేషన్స్ చేయాల్సి ఉంటుంది. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు టాప్ 5కి వెళ్తారన్నది చూడాలి.