Begin typing your search above and press return to search.

40 ఏళ్ల క్రితం ఇలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ వేరొక‌టి లేదు!

దాదాపు 40 ఏళ్ల క్రితం అప్ప‌టి పాత కాలం ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా రొటీనిటీని బ్రేక్ చేసి రిలీజైన `టార్జాన్` సినిమా కేవ‌లం 20ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో రూపొంది ఏకంగా 3 కోట్లు వ‌సూలు చేసింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 9:27 AM IST
40 ఏళ్ల క్రితం ఇలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ వేరొక‌టి లేదు!
X

వినోద ప‌రిశ్ర‌మ‌లో క్రియేటివిటీ ఉంటే ఆర్జించ‌డానికి హ‌ద్దులు లేవు. దాదాపు 40 ఏళ్ల క్రితం అప్ప‌టి పాత కాలం ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా రొటీనిటీని బ్రేక్ చేసి రిలీజైన `టార్జాన్` సినిమా కేవ‌లం 20ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో రూపొంది ఏకంగా 3 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాని వీక్షించేందుకు నాటి యూత్ పిచ్చెక్కిపోయారు. చొక్కాలు చింపుకుని, కిటికీలు బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ టికెట్ కౌంట‌ర్ల‌లోకి దూరారు జ‌నం. అలాంటి సెన్సేష‌న్ అప్ప‌ట్లో లేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కు టికెట్ క్యూల్లో ఎలా కొట్టుకునేవారో, అలాంటి దృశ్యం టార్జాన్ క్యూలో క‌నిపించింది.

అంద‌మైన అడ‌వి అడ‌విలో బాహ్య ప్ర‌పంచంతో సంబంధం లేని అడ‌వి మ‌నిషి (టార్జాన్). అత‌డిని వేటాడి ప‌ట్టుకుని, స‌ర్కస్ కంపెనీకి అమ్మేయాల‌ని ప్ర‌య‌త్నించే విల‌న్ మ‌ధ్య సాగే చిత్ర‌మిది. 1985లో విడుదలైన ఈ చిత్రం అడవిలో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ర‌క్తి క‌ట్టించింది. దీనికి మించి క‌థానాయిక గ్లామ‌ర్ ఎలివేష‌న్, ఘాఢ‌మైన ప్రేమ‌క‌థ‌, రొమాంటిక్ సీన్స్ యూత్ ని థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టించాయి. బబ్బర్ సుభాష్ దీనికి దర్శకత్వం వహించారు.

నటుడు హేమంత్ బిర్జే ఈ చిత్రంలో అరంగేట్రం చేసి టార్జాన్ పాత్రను పోషించాడు. హేమంత్ కి ఆ త‌ర్వాత భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ప్రజలు అతడిని `టార్జాన్ మ్యాన్` అని పిలిచేవారు. అడవిలో టార్జాన్‌ను కలిసే అమ్మాయిగా రూబీ శెట్టి న‌టించింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమకథ ఎంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే వారి ప్రేమ‌క‌థ‌లో విల‌న్ల కుట్ర ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాలి. ద‌లీప్ తాహిల్, ఓం శివపురి, నరేంద్రనాథ్, రూపేష్ కుమార్ వంటి అనేక మంది పాపులర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్ స‌హా కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు.