Begin typing your search above and press return to search.

తరుణ్​ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర వచ్చేసిందోచ్​​

మొదటి ప్రయత్నంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా మహాసముద్రం అనే సినిమాను చేశారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 11:33 AM GMT
తరుణ్​ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర వచ్చేసిందోచ్​​
X

హీరయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మంగళవారం. అజయ్‌ భూపతి దర్శకుడు. ఆర్​ఎక్స్ 100 వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్నసినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీ టీమ్​.. తాజాగా మరో మాస్ బీట్​ సాంగ్​ను రిలీజ్​ చేసింది.

ఏమైందో ఏమిటో, గంగన మోగాలిరా వంటి సాంగ్స్​ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నుంచి అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్​లో పెళ్లి చూపులు ఫేమ్​ దర్శకుడు తరుణ్ భాస్కర్​ లీడ్ రోల్ ప్లే చేశారు. నటుడు లక్ష్మణ్​తో కలిసి చిందులేశారు. గ్రామంలోని సీక్రెట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ సాగిన సాంగ్ లిరిక్స్​కు చిందులేశారు.

వీరిద్దరి హావాభావాలు, లుక్స్​ మాస్​ లుక్​లో బాగా ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్​ ఈ పాటను అద్భుతంగా ఆలపించగా.. అజనీశ్ లోక్​నాథ్ సంగీతం చాలా బాగుంది. గణేశ్ లిరిక్స్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది.

సినిమాలో పాయల్ రాజ్​పుత్ క్యారెక్టర్​ సస్పన్స్​గా పెట్టారు. ఇప్పటివరకు క్లారిటీగా రివీల్ చేయలేదు. ట్రైలర్​లో మాత్రం వేధింపులకు గురైన బాధితురాలిగా మాత్రం చూపించారు. ఇంకా అజయ్ ఘోష్, నందిత శ్వే, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సతీశ్, పృథ్వీ ఫైట్స్​ కొరియోగ్రఫీ చేశారు. దశరథి సివేంద్ర సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. తజుద్దీన్​ సయ్యద్​, రాఘవ్ డైలాగ్స్ అందించారు. ముద్ర మీడియా, క్రియేటివ్​ వర్క్స్​ బ్యానర్​పై సినిమాను నిర్మించారు.

కాగా, టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ​అజయ్ భూపతి ఒకరు. మొదటి ప్రయత్నంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా మహాసముద్రం అనే సినిమాను చేశారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

ఇప్పుడు మూడో సినిమాగా మంగళవారంతో రానున్నారు. అలాగే పాయల్​ రాజ్​పుత్​కు కూడా ఈ మధ్య సరైన హిట్ దక్కలేదు. మరి ఈ మంగళవారం సినిమా ఎంతవరకు ఆకట్టుకుని, వీరిద్దరికి ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో చూడాలి..