Begin typing your search above and press return to search.

హనుమాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూవీ హనుమాన్.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:15 AM GMT
హనుమాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూవీ హనుమాన్. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 11 భాషలలో రిలీజ్ అవుతోంది. మైథలాజికల్ ఫిక్షన్ మూవీ కావడంతో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తోనే మూవీపైన హైప్ క్రియేట్ చేశాడు.

భారీ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్పెషల్ షోలని ముంబైలో కొంతమంది జర్నలిస్ట్ లకి ప్రత్యేకంగా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు రాత్రికి కూడా స్పెషల్ ప్రీమియర్ షోలని ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. తాజాగా ఆయన రివ్యూని ట్విట్టర్ లో షేర్ చేశారు. మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చారు. తరుణ్ ఆదర్శ్ నుంచి అంత ఈజీగా ఏ సినిమాకి బెస్ట్ రేటింగ్ రాదు. అలాంటి ఫిల్మ్ క్రిటిక్ హనుమాన్ కి 3.5 రేటింగ్ ఇవ్వడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే ప్రశాంత్ వర్మ సినిమాని చాలా అద్భుతంగా డీల్ చేశాడని, మూవీలో ఎమోషన్, డ్రామా, విఎఫ్ఎక్స్, మైథాలజీ టచ్ తో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే సీక్వెన్స్ ని డిజైన్ చేశాడని ప్రశంసించారు. అలాగే తేజా సజ్జా కూడా మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడని, వరలక్ష్మి శరత్ కుమార్, విలన్ గా వినయ్ రాజ్, సముద్రఖని, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా భాగా డిజైన్ చేశారని, వారి నుంచి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చిందని రాసుకొచ్చారు.

ఓవరాల్ గా ఈ సినిమాని స్ట్రాంగ్ గా చూడమని రికమండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే విఎఫ్ఎక్స్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయని, కథని ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా పెర్ఫెక్ట్ గా ఉన్నాయని అన్నారు. మూవీ కచ్చితంగా నచ్చుతుందని తరుణ్ ఆదర్శ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.