టెన్షన్ పడుతూనే ఆ సీన్స్ రాశా
హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన బద్మాషులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ మల్లిక్ రామ్ తో కలిసి గెస్టుగా హాజరైన తరుణ్ భాస్కర్ కామెడీ సీన్స్ రాయడం ఎంత కష్టమో చెప్పాడు.
By: Tupaki Desk | 5 Jun 2025 2:00 AM ISTఏ నవ్వూ అంత తేలికగా రాదు, అవును, ఇదే మాటను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ కు కెరీర్ కొత్తలో హిట్స్ వచ్చినప్పటికీ తన ఆఖరి సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. తరుణ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతుంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సినిమా కీడా కోలా ఎన్నో అంచనాలతో వచ్చినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు. ఆ సినిమా ఆడకపోయినా సినిమాలో కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అయిందని టాక్ అయితే వచ్చింది. తరుణ్ కామెడీ చాలా స్పెషల్ గా ఉంటుందని తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆడియన్స్ ను నిరంతరం నవ్వించడమంటే అంత చిన్న విషయం కాదని అన్నాడు.
హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన బద్మాషులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ మల్లిక్ రామ్ తో కలిసి గెస్టుగా హాజరైన తరుణ్ భాస్కర్ కామెడీ సీన్స్ రాయడం ఎంత కష్టమో చెప్పాడు. కామెడీ సన్నివేశాలు రాయడం వెనుక నిజమైన కష్టముంటుందని, చాలా మంది కామెడీ సీన్స్ ను చాలా ఈజీగా తీసి పారేస్తారని, కానీ అది రాయడం చాలా కష్టమని తరుణ్ చెప్పాడు.
పెళ్లి చూపులు సినిమాకు కామెడీ సీన్స్ రాస్తున్నప్పుడు తన తండ్రి ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని, రాత్రి సమయాల్లో ఎంతో టెన్షన్ పడుతూనే ఆ సీన్స్ రాశానని కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నాడు. కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ ఇలాంటి విషయాలను వెల్లడించి తన నిజాయితీని బయటపెట్టాడు. ఇక బద్మాషులు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 6న రిలీజ్ కానుంది.
