విశ్వక్ ను కాదని.. విజయ్ తో..?
అయితే తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ తో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి విజయ్ సినిమాను స్టార్ట్ చేయడం వెనుక ఉన్న కారణమేంటోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 7 May 2025 11:45 AMటాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు దర్శకుడిగా చిత్రాలు తీస్తున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. డెబ్యూతో మంచి హిట్ అందుకున్నారు. చిన్న సినిమాతో విడుదలైన ఆ మూవీతో పెద్ద హిట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీని తీయగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ ను సాధించలేకపోయారు. కానీ ఆ సినిమా మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కీడా కోలా మూవీని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్.. అనుకున్న స్థాయిలో సినీ ప్రియులను మెప్పించలేకపోయారు.
అయితే తన యాక్టింగ్ టాలెంట్ ను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఆయన.. ఇప్పుడు సోలోగా ఓం శాంతి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా ఓం శాంతి చిత్రం సిద్ధమవుతోంది. అదే సమయంలో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో ఆయన వర్క్ చేస్తున్నారు.
స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. విశ్వక్ సేన్ తోనే ఆ సినిమా చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇంతలో విజయ్ దేవరకొండతో మరో సినిమా తరుణ్ భాస్కర్ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్.. విజయ్ దేవరకొండ మూవీని నిర్మించనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. టైటిల్ ను బినామీగా ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, మంచి ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుందని వినికిడి.
అయితే తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ తో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి విజయ్ సినిమాను స్టార్ట్ చేయడం వెనుక ఉన్న కారణమేంటోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి అటు విజయ్ దేవరకొండ.. ఇటు విశ్వక్ సేన్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. మరి దేవరకొండ ప్రాజెక్ట్ తో తరుణ్ భాస్కర్ తెరపైకి రావడానికి కారణమేంటో ఆయనకే తెలియాలి.