Begin typing your search above and press return to search.

హీరోయిన్‌తో బ్రేక‌ప్ అయిన కొద్ది రోజుల‌కే

బాలీవుడ్ స్నేహాలు, డేటింగ్ లు, బ్రేక‌ప్‌లు ఇవ‌న్నీ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్‌లోకి వ‌స్తుంటాయి. ఫ‌లానా హీరోయిన్ ఫ‌లానా హీరోతో డేటింగ్ చేస్తోంద‌నో లేదా బ్రేక‌ప్ అయింద‌నో నిత్యం క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:30 PM GMT
హీరోయిన్‌తో బ్రేక‌ప్ అయిన కొద్ది రోజుల‌కే
X

బాలీవుడ్ స్నేహాలు, డేటింగ్ లు, బ్రేక‌ప్‌లు ఇవ‌న్నీ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్‌లోకి వ‌స్తుంటాయి. ఫ‌లానా హీరోయిన్ ఫ‌లానా హీరోతో డేటింగ్ చేస్తోంద‌నో లేదా బ్రేక‌ప్ అయింద‌నో నిత్యం క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ర‌ణ‌బీర్ దీపిక నుంచి విడిపోయి క‌త్రిన‌తో డేటింగ్ లో ఉన్న‌ప్పుడు.. ర‌ణ్ వీర్ అనుష్క శ‌ర్మ నుంచి విడిపోయి దీపిక‌తో ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడు.. లేదా స‌ల్మాన్ నుంచి విడిపోయి విక్కీతో క‌త్రిన డేటింగ్ చేసిన‌ప్పుడు అలాగే, ఆలియా నుంచి సిద్ధార్థ్ మ‌ల్హోత్రా విడిపోయి కియ‌రా అద్వాణీతో డేటింగ్ లో ఉన్న‌ప్పుడు.. ఇవ‌న్నీ హెడ్ లైన్స్ లోకి వ‌చ్చాయి.

ఇప్పుడు అలాంటి మ‌రో హెడ్ లైన్ బాలీవుడ్ స‌ర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టుడు ఆధార్ జైన్ అందాల క‌థానాయిక‌ తారా సుతారియా నుంచి విడిపోయి, వేరొక భామ‌తో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌న‌నేది మీడియా హెడ్ లైన్ గా మారింది. తారా సుతారియా మాజీ-BF ఆధార్ జైన్ GF అలేఖా అద్వానీతో ప్రేమ‌లో ఉన్న‌ట్టు అధికారికంగా వెల్ల‌డైంది. ఇంత‌కుముందే తారా నుంచి విడిపోవడాన్ని ఆదార్ జైన్ ధృవీకరించారు. ప్రియురాలి నుంచి విడిపోయిన కొన్ని నెలల తర్వాత అలేఖా అద్వానీతో ఆదార్ జైన్ తన సంబంధాన్ని అధికారికంగా ఖ‌రారు చేసారు. అలేఖా అద్వానీతో డేటింగ్ లో ఉన్నాన‌ని తెలిపారు.

దీపావళి శుభ సందర్భంగా ఆ ఇద్దరూ అధికారికంగా దీనిని ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన లేడీ లవ్‌ను సాఫ్ట్‌గా లాంచ్ చేస్తూ `లైట్ ఆఫ్ మై లైఫ్` అని ఆధార్ జైన్ రాశాడు. ఈ ఫోటోలో ఆ ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ క‌నిపించారు. ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత, రిద్ధిమా కపూర్ సాహ్ని వ్యాఖ్యల విభాగంలో మీ లైట్ ని కలవడానికి నేను వేచి ఉండలేను అని వ్యాఖ్యానించారు. ఆధార్ జైన్ లెజెండ‌రీ రాజ్ కపూర్ మ‌న‌వ‌డు. కుమార్తె కొడుకు అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు బాలీవుడ్ లో స్టార్ గా వెల‌గాల‌ని క‌ల‌లుగంటున్నాడు.

2018లో తారా సుతారియా - ఆదార్ జైన్.. కరణ్ జోహార్ దీపావళి పార్టీలో కలుసుకున్నారు. కొన్ని సార్లు కలిసి కనిపించిన తర్వాత వారు 2020లో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ప్ర‌ముఖ మీడియాతో ప్రత్యేక చాట్‌లో తారా మొదటిసారిగా ఆ సంబంధం ముగిసిందని ధృవీకరించారు. త‌న‌ ప్రస్తుత డేటింగ్ జీవితం గురించిన అప్‌డేట్‌ను కూడా తారా షేర్ చేసింది. ``నేను సంబంధంలో లేను`` అని తెలిపింది. తారా- ఆదార్ దాదాపు 2 సంవత్సరాల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారు.

త‌న తల్లిదండ్రులు డేటింగ్ పుకార్లపై ఇప్పుడు అంత‌గా స్పందించ‌డం లేద‌ని కూడా తారా తెలిపారు. “అమ్మా నాన్న‌ నన్ను ఇబ్బంది పెట్టరు. నాకు ప్రపంచంలోనే చక్కని తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఉదయం నా గురించి ఈ విషయాలన్నీ చదివినప్పుడు, నా దగ్గరకు వస్తారు. మేము ఒక కప్పు టీ క‌లుపుకుని తాగుతూ చక్కగా నవ్వుతాము. నేను X, Y లేదా Z లతో జత కట్టడం గురించి మనం చదువుతూనే ఉంటాం. ఇది నా మొదటి చిత్రం విడుదలకు ముందు నుంచీ జరుగుతూనే ఉంది`` అని అన్నారు. తార - ఆధార్ స్నేహపూర్వకంగా విడిపోయార‌ని, స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారని కూడా క‌థనాలొస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరు కలిసి కనిపించడం లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తార తదుపరి అపూర్వ అనే సర్వైవల్ థ్రిల్లర్ (నవంబర్ 15న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది)లో కనిపిస్తుంది. ఇందులో తన పెళ్లికి ముందు కిడ్నాప్ కి గుర‌య్యే అమ్మాయిగా నటించింది. ఇది తనపై ఎలాంటి ప్రభావం చూపిందనే దాని గురించి తారా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. మేము షూటింగ్ చేస్తున్న జైసల్మేర్‌లో రోజంతా నేను అరుస్తూ, కేకలు వేయాల్సిన ప‌రిస్థితి. ఏం చేస్తాం..! యాక్షన్ చేయాల్సిన రోజులు అవి. రోజు చివరిలో రోజులో జరిగిన విషయాలను ఎలా తెలుసుకోవాలో నాకు నేనే నేర్పించవలసి వచ్చింది. ఎందుకంటే అరిచి అరిచి చివ‌రికి నా గొంతు చాలా హరించుకుపోయింది. అది నన్ను ప్రభావితం చేసింది కానీ అపూర్వ ప్రపంచం నుండి తెగతెంపులు చేసుకోవడం చాలా క‌ష్టం.. అని తెలిపింది.