Begin typing your search above and press return to search.

ఈ బాలీవుడ్ వాళ్ళు మన తారక్ ను ముంచరుగా?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు ఏమాత్రం కొదవ ఉండేది కాదు కంటెంట్ ఎలా ఉన్నా కూడా జనాల్లో ఎగబడి చూసేవారు

By:  Tupaki Desk   |   15 Nov 2023 6:33 AM GMT
ఈ బాలీవుడ్ వాళ్ళు మన తారక్ ను ముంచరుగా?
X

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు ఏమాత్రం కొదవ ఉండేది కాదు కంటెంట్ ఎలా ఉన్నా కూడా జనాల్లో ఎగబడి చూసేవారు. ఆ రేంజ్ లో అప్పుడు వాళ్ళ పప్పులు ఉడికేవీ. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో అంతకుమించి యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. కానీ మన వాళ్లు మాత్రం ఏదో ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లోకల్ ఫ్లేవర్ లో విలేజ్ బ్యాక్ గ్రౌండ్, వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంటూ మంచి యాక్షన్ డోస్ ఇస్తున్నారు.

దీంతో నార్త్ ఆడియన్స్ కూడా బాలీవుడ్ సినిమాల పై పెద్దగా ఆసక్తి చూపించకుండా ఎక్కువగా సౌత్ సినిమాలపై ప్రేమను పెంచుకుంటున్నారు. అయితే టైగర్ 3 దెబ్బకు ఇప్పుడు రాబోయే వార్ సినిమాపై కాస్త భయాలు మొదలవుతున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ సీరీస్ టైగర్ మొదటి రెండు భాగాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ టైగర్ 3లో అంత కొత్త తరహా కంటెంట్ ఏమి లేదు. దీంతో సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది.

దీంతో యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగమైన వార్ 3 ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఒకసారి ప్రభాస్ బాలీవుడ్ వాళ్ళను నమ్మి ఆదిపురుష్ తో ఊహించని దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమాలో నెగిటివ్ షెడ్యూల్ మాత్రమే చేయబోతున్నాడు. దీంతో అతనికి బాలీవుడ్ వాళ్ళు ఎలాంటి ఫలితం ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

వార్ 2 లో హృతిక్ రోషన్ హీరో అయినప్పటికీ తారక్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడును ఆయన్ ముఖర్జీ మంచి టాలెంట్ అయినప్పటికీ బ్రహ్మాస్త్ర సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంతకుముందు అతడు పెద్దగా యాక్షన్ సినిమాలు ఏమీ చేయలేదు.

ఇక రీసెంట్ గా వచ్చిన టైగర్ 3 యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఒక భాగమే. ఇక పఠాన్ సినిమా బాగానే ఆడింది. కానీ టైగర్ 3 మాత్రం చాలా రెగ్యులర్ కాన్సెప్ట్ తో వచ్చేసింది. ఎప్పటి లానే పాకిస్తాన్ టచ్ ఉండడం ఆడియోన్స్ నచ్చలేదు. పైగా దర్శకుడు మనీష్ శర్మ ఇప్పటివరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. అలాంటి దర్శకుడికి స్పై ప్రాజెక్ట్ ఎలా ఇచ్చారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.