Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోస్ట‌ర్లు వేయ‌డంలో ఆ హీరో అభిమానులే టాప్!

కాకినాడ ద‌గ్గ‌ర ఉన్న‌ ఉప్పాడ గ్రామమంతా ఎన్టీఆర్ అభిమానులే నంట‌. ఎన్టీఆర్ కి ఉప్పాడ‌లో వేసిన‌న్ని పోస్ట‌ర్లు అంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంకెక్క‌డా క‌నిపించ‌వ‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 8:01 AM GMT
సంక్రాంతి పోస్ట‌ర్లు వేయ‌డంలో ఆ హీరో అభిమానులే టాప్!
X

టాలీవుడ్ స్టార్ హీరోల డైహార్ట్ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల కోసం ప్రాణ త్యాగాల‌కు సైతం సిద్ద‌ప‌డే అభిమానులు వీళ్లంతా. అభిమాన హీరో రిలీజ్ అవుతుందంటే? థియేట‌ర్ ని అందంగా ముస్తాబు చేయ‌డంలో ముందుంటారు. షో ఏదైనా ముందు చూసేది తామే అంటారు. ఇక గ్రామాల్లో సైతం హీరోల పోస్ట‌ర్లు..క‌టౌట్లు భారీగా వెలుస్తుంటాయి. ఎలాంటి పండ‌గొచ్చినా పోస్ట‌ర్లు వేయ‌డంలో ముందుంటారు.

అందులోనూ సంక్రాంతి..న్యా ఇయ‌ర్ లాంటి పోస్ట‌ర్లు అయితే అంద‌రి హీరోల అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటారు. పోస్ట‌ర్ లో అభిమాన హీరో పెద్ద బొమ్మ‌ని వేసి కిందా..పైనా..అటువైపు..ఇటువైపు వాళ్ల పాస్ పోర్ట్ ఫోటోలు వేసుకుని అభిమానం చాటుకుంటారు. ఇలా హీరోలపై ఇంత‌లా అభిమానం చూప‌డం అన్న‌ది టాలీవుడ్ ..కోలీవుడ్ లోనే చోటు చేసుకుంది. దేశంలో ఎక్క‌డా ఇంత హంగామా ఉండ‌దు.

మ‌రి ఏపీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోస్ట‌ర్లు వేయ‌డంలో ముందు ఉండేది? ఎవ‌రు అంటే ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ పై త‌న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. కాకినాడ ద‌గ్గ‌ర ఉన్న‌ ఉప్పాడ గ్రామమంతా ఎన్టీఆర్ అభిమానులే నంట‌. ఎన్టీఆర్ కి ఉప్పాడ‌లో వేసిన‌న్ని పోస్ట‌ర్లు అంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంకెక్క‌డా క‌నిపించ‌వ‌ని అన్నారు. అంత భారీ ఎత్తున పోస్ట‌ర్లు..క‌టౌట్లు ఉప్పాడ‌లో ఏటా ద‌ర్శ‌న‌మి స్తుంటాయిట‌.

ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం చూపిస్తారుట‌. పోస్ట‌ర్ల‌కు పాలాభిషేకం చేయడం లాంటివి అక్క‌డ బాగా త‌రుచూ చోటు చేసుకుంటాయట‌. బుచ్చిబాబు అదే ప్రాంతానికి చెందిన వారు అన్న సంగ‌తి తెలిసిందే. కాకినాడ‌కి చెందిన ద‌ర్శ‌కుడు సుకుమార్ అసిస్టెంట్ గా ప్రారంభ‌మైన బుచ్చిబాబు నేడు రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేసే స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.