Begin typing your search above and press return to search.

తారక్ ఐకానిక్ హగ్.. ఎవరొచ్చినా అదే లవ్!

ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానించని వారు ఉండరు. మెగా ఫ్యామిలీకి సైతం తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం.

By:  Tupaki Desk   |   4 April 2024 4:34 AM GMT
తారక్ ఐకానిక్ హగ్.. ఎవరొచ్చినా అదే లవ్!
X

ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానించని వారు ఉండరు. మెగా ఫ్యామిలీకి సైతం తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. మెగాస్టార్ చాలా సందర్భాలలో యువ హీరోలలో బెస్ట్ డాన్సర్ అంటే తారక్ అని చెప్పారు. రామ్ చరణ్, తారక్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్య అంత క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా వచ్చింది.

అలాగే ప్రతి ఒక్కరితో సరదాగా ఉండే వ్యక్తిత్వం తారక్ సొంతం. ఆ వ్యక్తిత్వమే జూనియర్ ఎన్టీఆర్ కి అందరిని అభిమానులుగా మార్చేస్తుంది. కెమెరా ముందుకి వస్తే క్షణాల్లో ట్రాన్స్ ఫర్మేషన్ అయిపోయి క్యారెక్టర్ లో పరకాయప్రవేశం చేసేసే తారక్ కెమెరా బ్యాక్ మాత్రం అందరిని ఆటపట్టిస్తూ, సరదాగా స్పెండ్ చేస్తాడు. ఇప్పుడున్న యువ హీరోలలో చాలా మంది తారక్ కి క్లోజ్ గా ఉంటారు.

వారు కలిసిన సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ తన ఆప్యాయతని చూపిస్తారు. ఫ్యాన్ బోయ్స్ గా వచ్చిన హీరోల దగ్గర సైతం స్టార్ హీరో అనే బిహేవియర్ తారక్ ఎప్పుడూ చూపించడు. వారితో ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నట్లు హగ్ చేసుకొని ఆప్యాయంగా పలకరిస్తాడు. తాజాగా విశ్వక్ సేన్ తారక్ ని కలిసాడు. విశ్వక్ తారక్ కి పెద్ద ఫ్యాన్ కూడా. తారక్ ని కలిసిన విశ్వక్ కి అద్భుతమైన పలకరింపు లభించింది.

ఎవరు కలిసినా కూడా తారక్ ఒకే రకమైన హగ్ ఇవ్వడం కామన్ గా మారిపోయింది. అది తారక్ ట్రేడ్ మార్క్ హగ్ అని చెప్పవచ్చు. గతంలో నేచురల్ స్టార్ నాని కూడా తారక్ ని కలిసినపుడు అలాగే హగ్ చేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చారు. ఆ ఫోటో కూడా వైరల్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని హగ్ చేసుకొని తీసుకున్న ఫోటోలు కూడా ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి.

దీనిని బట్టి తారక్ యంగ్ హీరోలతో అయిన, డైరెక్టర్స్ తో అయిన ఎంతో క్లోజ్ గా ఉంటాడు అనేది చెప్పొచ్చు. ఈ కారణంగా తారక్ ని ఇండస్ట్రీలో అందరూ అభిమానిస్తూ ఉంటారు. విశ్వక్ ను కూడా అదే తరహాలో హగ్ చేసుకొని ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని విశ్వక్ సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. స్టార్ బాయ్ సిద్దు కూడా తారక్ ని కలుసుకున్నాడు.

అతనితో కూడా తారక్ హగ్ చేసుకొని ఫోటో దిగాడు. ఈ ఫోటో కూడా ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. సితార నాగ వంశీతో తారక్ కి మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. నాగ వంశీ టిల్లు స్క్వేర్ తో సిద్దు జొన్నలగడ్డతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ తో చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఇక భవిష్యత్తులో హారిక హాసిని లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని ఇదివరకే నాగ వంశీ తెలియజేశారు.