Begin typing your search above and press return to search.

ఒకే టైమ్ లో బన్నీ, తారక్!

కాని దేవర, పుష్ప ఒకే నెలలో రెండు, మూడు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2023 5:35 AM GMT
ఒకే టైమ్ లో బన్నీ, తారక్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో మొదటి చిత్రం కంటే మరింత గ్రాండియర్ గా ఈ మూవీని చేసే ప్రయత్నం జరుగుతోంది. మూవీలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా లెవల్ లో సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ ట్రెండ్ మూవీ తర్వాత తారక్ చేస్తోన్న సినిమా ఇదే కావడంతో అందరి కళ్ళు దేవర చిత్రంపై ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.పాన్ ఇండియా లెవల్ లో అందరి దృష్టిని ఆకర్షించే ప్రాజెక్ట్ ఇది అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాని కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. కాని దేవర, పుష్ప ఒకే నెలలో రెండు, మూడు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, తారక్ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇద్దరు ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారు.

అంత క్లోజ్ రిలేషన్ ఉన్న ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఒకే నెలలో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అయితే పుష్ప 2 డేట్ ఫిక్స్ కాలేదు కాబట్టి ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని అనుకోలేము. అయితే ఏవైనా జరిగితే ఒకరికి ఒకరు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.