Begin typing your search above and press return to search.

తారక్ vs బాలయ్య.. గుడ్ న్యూస్ ఏంటంటే..

షూటింగ్ అయితే చాలా హడావిడిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి బ్రేక్ లేకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం పనులను పూర్తి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 10:30 AM GMT
తారక్ vs బాలయ్య.. గుడ్ న్యూస్ ఏంటంటే..
X

జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తో ఎలాగైనా ప్రపంచ వ్యాప్తంగా మరొక రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని ఎన్టీఆర్ కసిగా వర్క్ చేస్తున్నాడు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమాతోనే ఆచార్య గాయాన్ని మర్చిపోయేలా చేయాలని చూస్తున్నాడు.

షూటింగ్ అయితే చాలా హడావిడిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి బ్రేక్ లేకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం పనులను పూర్తి చేస్తున్నారు. రీసెంట్గా గోవాలో ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి చేయడం జరిగింది. ఇక అందులోనే కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ఒక పాట షూటింగ్ ను పూర్తి చేశారు.

అయితే ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ టైంలో పెద్దగా పాన్ ఇండియా సినిమాలతో పోటీ లేదు కాబట్టి అదే బెస్ట్ రిలీజ్ అని దేవర ఫిక్స్ అయింది. కానీ ఆ టైంలో నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి పోటీ ఉండే అవకాశం ఉంది అని వచ్చిన టాక్ నందమూరి ఫ్యాన్స్ ను కంగారు పెట్టాయి.

బాలకృష్ణ NBK109 సినిమా దాదాపు అదే టైంలో వచ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఆ సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న NBK109 సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. రీసెంట్గా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టును 2024 మార్చి చివరలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు ఒక టాక్ వినిపించింది.

అంటే దాదాపు బాబాయ్ అబ్బాయ్ కంటే ఒక వారం ముందేబాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలయ్య ఆ టైంలో రాకపోవచ్చు అని తెలుస్తోంది. షూటింగ్ కోసం కాస్త ఎక్కువ సమయం అవసరం అవుతూ ఉండడంతో అదే ఏడది మే రెండవ వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ మధ్యలో ఎలాంటి బాక్సాఫీస్ క్లాష్ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.