బ్రేకప్ అయ్యాక కొత్త ప్రియుడితో చెట్టా పట్టాల్
అదంతా అటుంచితే, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో కథానాయికగా పరిచయమైన తారా సుతారియా ఇప్పుడు కొత్త బోయ్ ఫ్రెండ్ తో కనిపించడం చర్చగా మారంది.
By: Tupaki Desk | 30 May 2025 8:15 AM ISTరంగుల ప్రపంచంలో ప్రేమాయణాలు, బ్రేకప్ లు, తిరిగి ప్రేమలో మునగడాలు.. ఇవన్నీ షరా మామూలు విషయాలు. ముఖ్యంగా యువహీరోలు, యువహీరోయిన్ లు ఒకరి కంటే ఎక్కువమందితో డేటింగులు చేస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. లవ్ బ్రేకప్ అవ్వడం, ఆ తర్వాత కొత్త బోయ్ ఫ్రెండ్ తో షికార్ చేస్తూ కనిపించడం రొటీన్ గా మారింది. అటు యువహీరోలకు కూడా ఇది వర్తిస్తుంది. తన గాళ్ ఫ్రెండ్ కి హ్యాండిచ్చి కొత్త అమ్మాయితో షికార్లు చేస్తూ దొరికిపోయిన హీరోలున్నారు.
అదంతా అటుంచితే, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో కథానాయికగా పరిచయమైన తారా సుతారియా ఇప్పుడు కొత్త బోయ్ ఫ్రెండ్ తో కనిపించడం చర్చగా మారంది. ఆధార్ జైన్ నుంచి విడిపోయిన తర్వాత ఈ కొత్త స్నేహితుడిని కనుగొంది తారా. ఈ క్యూట్ బ్యూటీ తన తొలి చిత్ర కథానాయిక అనన్య పాండే .. ఆదిత్యరాయ్ నుంచి విడిపోయిన క్రమంలో, ఇప్పుడు తారా సుతారియా కూడా ఎక్స్ నుంచి విడిపోయి కొత్త డేట్ మొదలు పెట్టడం చర్చగా మారింది. ఇంతకీ తారా కొత్త లవర్ ఎవరు? అంటే...!
తారా సుతారియా వీర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం...``ఈ సంవత్సరం ప్రారంభంలో `స్కై ఫోర్స్` చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసిన వీర్ తో తారా నిండా ప్రేమలో ఉంది. ఇద్దరూ రెండు నెలలుగా డేటింగ్ చేస్తున్నారు`` అని తెలుస్తోంది. ప్రస్తుతం ఒకరినొకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తరచుగా డేటింగ్ కోసం బయటకు వెళ్తూ ఉంటారు! అని తెలుస్తోంది. ఆసక్తికరంగా తారా - వీర్ కూడా ఒకే రెస్టారెంట్‌లో కనిపించిన కొన్ని రోజులకే ఈ కొత్త అప్ డేట్ అందింది. తారా కొందరు స్నేహితురాళ్లతో రెస్టారెంట్ నుంచి వెళ్లి పోగా, వీర్ ఒంటరిగా బయటకు వచ్చి కెమెరాలకు ఫోజులివ్వడం చర్చగా మారింది.
