ఒంటరి పోరాటంపై ఔట్ సైడర్ నటి ఆవేదన
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ఇది ఇయర్ 2` చిత్రంతో కథానాయికగా పరిచయమైంది తారా సుతారియా.
By: Tupaki Desk | 7 July 2025 8:15 AM ISTకరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ఇది ఇయర్ 2` చిత్రంతో కథానాయికగా పరిచయమైంది తారా సుతారియా. అనన్య పాండే- టైగర్ ష్రాఫ్ కలిసి నటించింది. తారా ఇటీవలే పరిశ్రమలో ఐదు సంవత్సరాలకు పైగా కెరీర్ జర్నీ చేసిన సందర్భంగా.. పరిశ్రమలో తన పోరాటంపై మాట్లాడుతూ ఔట్ సైడర్ గా తాను ఒంటరిని అయ్యానని తెలిపింది. ఒకానొక దశలో తనకు మార్గనిర్ధేశనం చేసే సరైన వ్యక్తి కావాలని అనిపించినట్టు వెల్లడించింది.
సినీపరిశ్రమలో చాలా విషయాలకు అలవాటు పడటానికి సమయం పట్టింది. అదే పరిశ్రమ వ్యక్తి అయితే వేగంగా అల్లుకుపోవడానికి ఛాన్సుంటుంది. చాలా విషయాలపై అప్పటికే అవగాహన ఉంటుందని కూడా తారా చెప్పింది. ఇక్కడ నేను ఒంటరిపోరాటం చేస్తున్నట్టు అనిపించిందని తారా తెలిపింది. నా కెరీర్‌లో నాకు మార్గదర్శకత్వం ఉంటే బాగుండు అని నేను కోరుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. పరిశ్రమ లోపలి నుండి నాకు ఎవరైనా సహాయం చేయగలిగితే బాగుండు అనిపించిందని తార అన్నారు. ఇన్ సైడర్స్ కి చాలా విషయాలు వర్కవుట్ అవుతాయని కూడా తారా సుతారియా వెల్లడించింది.
ఇక తారా సుతారియా ఇటీవలే తన మాజీ ప్రియుడు, ప్రాణ స్నేహితుడు ఆధార్ జైన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అతడు తారా స్నేహితురాలే అయిన అలేఖా అద్వానీ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.
