Begin typing your search above and press return to search.

రూమ‌ర్లు కూడా ఇలా నిజ‌మ‌వుతాయా?

సెల‌బ్రిటీల‌పై నిత్యం ఎన్నో ర‌కాల రూమ‌ర్లు వ‌స్తుంటాయి. ఎక్కువ‌గా ఏ సినిమాలో ఏ న‌టి న‌టిస్తుంది? అన్న అంశంపై గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తుంటాయి.

By:  Tupaki Desk   |   24 Dec 2023 3:30 PM GMT
రూమ‌ర్లు కూడా ఇలా నిజ‌మ‌వుతాయా?
X

సెల‌బ్రిటీల‌పై నిత్యం ఎన్నో ర‌కాల రూమ‌ర్లు వ‌స్తుంటాయి. ఎక్కువ‌గా ఏ సినిమాలో ఏ న‌టి న‌టిస్తుంది? అన్న అంశంపై గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తుంటాయి. అవి కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే. అందులో ఏది వాస్త‌వం ..ఏది అవాస్త‌వం అన్న‌ది క్లారిటీ ఉండ‌దు. సోర్స్ ని బేస్ చేసుకుని అల్లుకున్న క‌థ‌లే ఎక్కువ‌గా ఉంటాయి. కానీ అప్పుడ‌ప్పుడు అలాంటి రూమ‌ర్స్ కూడా నిజ‌మ‌వుతాయ‌ని తాజాగా తాప్సీ విష‌యంలో రుజువైంది.


కొన్నిసార్లు పుకార్లు కూడా నిజ‌మ‌వుతాయి. `డంకీ`లోని మ‌ను పాత్ర ఆఫ‌ర్ అలాగే త‌న‌కి వ‌చ్చిందంటోంది తాప్సీ. షారుక్ ఖాన్..తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన `డంకీ` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌ను పాత్ర ఛాన్స్ త‌న‌కొస్తుంద‌ని తాప్సీ ఏమాత్రం ఊహించ‌లేదుట‌. `డంకీ` ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన కొత్త‌లో షారుక్ ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తారా? అంద‌రి క‌థానాయిక‌ల్లాగే తాప్సీ కూడా అనుకుందిట‌.

`ఎలా మొద‌లైందో తెలియ‌దు గానీ..ఆ చిత్రంలో తాను కూడా న‌టిస్తున్న‌ట్లు ఓ రూమ‌ర్ నెట్టింట వైర‌ల్ అయింది. దాన్ని నేను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. సాధారంగా వ‌చ్చే రూమ‌ర్ అని కొట్టిపారేసా. కొన్నాళ్ల‌కి సౌత్ కొరియ‌న్ సినిమాలో న‌టిస్తున్న స‌మ‌యంలో విదేశీ షూటింగ్ లో ఉన్నాను. అప్పుడే రాజ్ కుమార్ స‌ర్ నుంచి ఫోన్ వ‌చ్చింది. డంకీ లో నువ్వే హీరోయిన్ అంటున్నారంతా? ఆ వార్త‌ని నిజం చేద్దామా? ఇండియా రాగానే చెప్పు.

వ‌చ్చి క‌థ చెబుతాను అన్నారు. ఆ మాట‌తో ఒక్క‌సారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ప‌ట్ట‌లేని సంతోషానికి గుర‌య్యాను. అక్క‌డ నుంచి తిరిగి రాగానే వెంట‌నే వెళ్లి సార్ న క‌లిసాను. అప్పుడు ఆయ‌న క‌థ చెప్ప‌డం..నేను ఒకే అన‌డం వెంట వెంట‌నే జ‌రిగియాయి. అలాంటి లెజెండ‌రీ ద‌ర్శ‌కుడి సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఎవ‌రైనా? వ‌దులు కుంటారా? ఆ త‌ప్పు నేను చేయ‌లేదు. ఎస్ చెప్పి సంత‌కం చేసి వ‌చ్చాను` అంది.