Begin typing your search above and press return to search.

తాప్సీ సీక్రెట్ పెళ్లి ఎందుకంటే?

తాప్సీ పన్ను తన ప్రియుడు మథియాస్ బోని సీక్రెట్ గా పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 April 2024 6:20 AM GMT
తాప్సీ సీక్రెట్ పెళ్లి ఎందుకంటే?
X

తాప్సీ పన్ను తన ప్రియుడు మథియాస్ బోని సీక్రెట్ గా పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. కేవలం కొద్దిమంది కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో అత్యంత గోప్యంగా ఈ పెళ్లి జ‌రిగింది. వెన్యూ వ‌ద్ద నుంచి ఒకే ఒక్క వీడియో ఇంత‌కుముందు సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చింది. తాప్సీని వధువుగా అలంకరించాక నృత్యం చేస్తూ వ‌రుడిని చేరుకుంటున్న వీడియో రివీలయ్యాకే తాప్సీ పెళ్లి జ‌రుగుతోంద‌ని తెలిసింది. తాప్సీ ఎందుకింత ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది? అంటూ ఒక ప్ర‌శ్న ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. వివాహానంతరం తన మొదటి ఇంటర్వ్యూలో తాప్సీ దీనికి జ‌వాబిచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై పరిశీలన జ‌రిపే ప్ర‌జ‌ల గురించి ఆందోళన వ్య‌క్తం చేస్తూ.. ఫోటోలను లేదా పెళ్లి వీడియోల‌ను షేర్ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని క్లారిటీగా చెప్పింది తాప్సీ.


నేను నా వ్యక్తిగత జీవితాన్ని ప్ర‌జ‌ల‌ పరిశీలనకు ఓపెన్ గా ఉంచాల‌ని అనుకోవ‌డం లేదు. నా భాగస్వామి లేదా పెళ్లిలో ఉన్న వ్యక్తులు అంతా ప్ర‌యివేట్. అందుకే నా దగ్గరే ఫోటోలు ఉంచుకున్నాను. ఉద్దేశ్యం ఎప్పుడూ రహస్యంగా ఉంచకూడదు. నేను దీన్ని (ఈ పెళ్లిని) పబ్లిక్ ఎఫైర్‌గా చేయాలనుకోలేదు. ఎందుకంటే దానిని ప్ర‌జ‌లు ఎలా గ్రహిస్తారోన‌ని ఆందోళనలో ఉన్నాను. అందుకే ఫోటోల‌ను షేర్ చేయ‌ను.. అని అన్నారు.

పెళ్లిని ఎందుకు గోప్యంగా ఉంచింది?

త్వరలో అధికారిక ప్రకటన చేయాలనుకుంటున్నారా లేదా సోషల్ మీడియాలో తన వివాహ ఆల్బమ్‌ను షేర్ చేయాలనుకుంటున్నారా అని ప్ర‌శ్నించ‌గా.. నా వ్యక్తిగత జీవితాన్ని.. ఆ స్పేస్ లో ఉన్న వ్యక్తులను బ‌హిర్గ‌తం చేయాల‌ని నేను అనుకోవ‌డం లేదు. ఏం చేయాలో నాకు క‌చ్చితంగా తెలియదు. పబ్లిక్ ఫిగర్ వివాహం చేసుకున్నప్పుడు జరిగే పరిశీలన చాలా ఎక్కువ‌. దీనికి సంతకం చేసింది నేను.. నా భాగస్వామి కాదు.. పెళ్లిలో పాల్గొన్న వ్యక్తులు కాదు.. ఈ ఫోటోలు షేర్ చేయాలో లేదో నాకు తెలీదు. అందుకే నేను దానిని నా వద్దే ఉంచుకున్నాను.. అని అంది. తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ వేడుకలో భాగమయ్యారని, తన సంబంధం గురించి తాను ఎప్పుడు, ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనే దాని గురించి తనకు ఎప్పుడూ స్ప‌ష్ఠ‌త ఉంద‌ని తాప్సీ చెప్పింది. తన పెళ్లిని పబ్లిక్ ఎఫైర్‌గా చేయ‌డం తనకు ఇష్టం లేదని తెలిపింది. ఎందుకంటే వేడుక‌ను ఆనందించడం కంటే దానిని ఎలా సంగ్ర‌హిస్తారు? అనే దాని గురించి ఆందోళన చెందాన‌ని తాప్సీ అంది.

నాకు ఎలాంటి పెళ్లి ఫోటోలు లేదా వివరాలు విడుదల చేయాల‌నే ప్రణాళికలు లేవు. నేను ఇప్పుడు దానిని బయట పెట్టడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు భావించడం లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు నాకు తెలుసు.. వారు నాకోసం అక్కడ ఉండాలనుకున్నారు. తీర్పు చెప్పడానికి హాజరు కాలేదు.. అందుకే నేను చాలా రిలాక్స్ డ్ గా ఉన్నాను... భవిష్యత్తులో, నేను దాని గురించి (వివాహ వివరాలు) షేర్ చేయ‌డానికి సౌకర్యంగా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను.. అని అన్నారు.

తాప్సీ పన్ను మార్చి 23న త‌న‌ బాయ్‌ఫ్రెండ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. జాతీయ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. మార్చి 20 నుండి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే తాప్సీ పెళ్లి వెనుక ఉన్న బృందం వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్రకారం పెళ్లి తేదీ మార్చి 22. ఈ పెళ్లికి నిర్మాత-రచయిత కనికా ధిల్లాన్, న‌టి పావైల్ గులాటి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

తొలి ప‌రిచ‌యం అలా:

తాప్సీ- మథియాస్ మొదటిసారిగా 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో కలుసుకున్నారు. అక్కడ వారి మధ్య స్నేహం ఏర్పడి చివరికి ప్రేమగా మారింది. విభిన్న రంగాల వ్య‌క్తులు వారి షెడ్యూల్‌లతో బిజీగా ఉన్నప్పటికీ వారు ప్రజల దృష్టికి దూరంగా తమ బంధాన్ని పెంపొందించుకోగలిగారు. పెళ్లితో క‌థ సుఖాంత‌మైంది.