Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కిల్లింగ్‌ లుక్ తో రెడ్‌ అందాల బ్యూటీ

రెడ్‌ డ్రెస్ లో కిల్లింగ్‌ లుక్స్ తో తాప్సి అందాల ఆరబోతకు ఎంతటి వారైనా కూడా ఫిదా అవ్వాల్సిందే. ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2024 10:17 AM GMT
పిక్ టాక్ : కిల్లింగ్‌ లుక్ తో రెడ్‌ అందాల బ్యూటీ
X

మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు, సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసింది. కానీ అదృష్టం కలిసి రాలేదు.

ఈ అమ్మడి కెరీర్ ఆరంభంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. దాంతో టాలీవుడ్‌ లో ముందు ముందు కష్టాలు తప్పవు అనే ఉద్దేశ్యంతో కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో ప్రయత్నాలు చేసింది. లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

హిందీలో మొదట లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ చేసిన ఈ అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చింది. గత ఏడాది షారుఖ్‌ ఖాన్‌ తో కలిసి డంకీ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. మొత్తానికి వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

మరో వైపు ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఈసారి రెడ్‌ డ్రెస్ లో అందాల విందు చేస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రెడ్‌ డ్రెస్ లో కిల్లింగ్‌ లుక్స్ తో తాప్సి అందాల ఆరబోతకు ఎంతటి వారైనా కూడా ఫిదా అవ్వాల్సిందే. ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. రెగ్యులర్‌ అందాల ఫోటో షూట్‌ కి ఈ ఫోటోలు విభిన్నంగా ఉన్నాయని, ఇంతటి అందగత్తెను టాలీవుడ్‌ మిస్‌ అవుతుందని కొందరు అంటున్నారు.