Begin typing your search above and press return to search.

అందరూ చేస్తే నేనెందుకు చేయాలి?

తెలుగు సినిమా ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తాప్సిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:30 PM GMT
అందరూ చేస్తే నేనెందుకు చేయాలి?
X

తెలుగు సినిమా ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తాప్సిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా దర్శకేంద్రుడి హీరోయిన్‌ బ్రాండ్ వల్ల తాప్సికి టాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు దక్కిన విషయం తెల్సిందే.


హీరోయిన్‌ గా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా కూడా కమర్షియల్ గా మాత్రం తాప్సికి ఆశించిన స్థాయిలో భారీ విజయాలు దక్కలేదు. దాంతో మెల్లగా బాలీవుడ్ వైపు ఇతర భాషల సినిమాల వైపు తాప్సి అడుగులు వేసింది. అక్కడ ఈ అమ్మడికి అదృష్టం కొద్ది కాలం కలిసి వచ్చి మంచి విజయాలు దక్కి స్టార్‌ హీరోల సినిమాల్లో ప్రస్తుతం నటిస్తోంది.

గతంలో వరుసగా లేడీ ఓరియంటెడ్‌ యాక్షన్ సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం ఆ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆ సినిమాలు చేయక పోవడానికి కారణం పై తాప్సి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇతర హీరోయిన్స్ అందరూ చేస్తున్న యాక్షన్‌ సినిమాలను నేను గతంలోనే చేశాను. ఇప్పుడు అందరూ చేస్తే నేను ఎందుకు చేయాలి. ట్రెండ్‌ కు తగ్గట్లుగా సినిమాలు చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే మంచి కథ మరియు నా నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న పాత్ర తో ఎవరు వచ్చినా యాక్షన్‌ సినిమాలు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

అందరూ ఏది చేస్తే నేను అదే చేయాలి అని నియమం లేదు. కనుక నాకు నచ్చిన జోనర్‌ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. అంతే తప్ప అందరూ చేస్తున్నారని నేను కూడా అదే తరహా సినిమాలు చేయను. ఒక వేళ అందరూ అవే సినిమాలు చేస్తే ముందు ముందు ప్రతి శుక్రవారం కూడా అవే సినిమాలు ఉంటాయి. కనుక కొత్తగా ప్రయత్నిస్తే తప్పేం లేదు అన్నట్లుగా తాప్సి చెప్పుకొచ్చింది.