Begin typing your search above and press return to search.

తాప్సి బయోపిక్‌ కి వింత టైటిల్‌

సొట్టబుగ్గల సుందరి తాప్సి టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్‌ గా తప్సి కెరీర్‌ ఆరంబంలో మంచి పేరును సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 5:21 AM GMT
తాప్సి బయోపిక్‌ కి వింత టైటిల్‌
X

సొట్టబుగ్గల సుందరి తాప్సి టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్‌ గా తప్సి కెరీర్‌ ఆరంబంలో మంచి పేరును సొంతం చేసుకుంది. పెద్ద హిట్స్‌ లేకుండానే స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో బిజీగా ఉంది.

తాప్సి బాలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచింది. అంతే కాకుండా కమర్షియల్‌ సినిమాలతో కూడా వరుసగా సక్సెస్ లను దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా మళ్లీ సౌత్‌ లో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది.

బాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న తాప్సి ఈ మధ్య కాలంలో పలు విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తన ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ మూవీ చక్‌ దే ఇండియా. తన చిన్నప్పటి నుంచి కూడా హృతిక్‌ రోషన్‌, జాన్‌ అబ్రహం అంటే చాలా ఇష్టం. దర్శకుడు మణిరత్నం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలి అనేది నా కోరిక.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. నా జీవితంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. అందుకే నా బయోపిక్ ను తీస్తే 'ఐయామ్‌ డిఫికల్ట్‌' అనే టైటిల్‌ తో సినిమాను చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.