Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో జోష్ నింపిన ర‌క్షాబంధ‌న్

రక్షా బంధన్ 2023 అత్యంత‌ వైభ‌వంగా అనుబంధాల క‌ల‌బోతగా సాగింది. రాఖీ డే ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా గ‌డిపారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:46 AM GMT
టాలీవుడ్‌లో జోష్ నింపిన ర‌క్షాబంధ‌న్
X

రక్షా బంధన్ 2023 అత్యంత‌ వైభ‌వంగా అనుబంధాల క‌ల‌బోతగా సాగింది. రాఖీ డే ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా గ‌డిపారు. ఈ భూమిపై అత్యంత ప్రత్యేకమైన బంధాన్ని గుర్తు చేసే అరుదైన పండ‌గ ఇది. సోదరుడు - సోదరి మధ్య అనుబంధానికి సింబాలిక్ గా హిందువుల పండుగలలో రక్షా బంధన్ ముఖ్యమైనది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజ ప్రజలంతా జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం రక్షా బంధన్ తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం మారుతూ ఉంటుంది. రక్షా బంధన్ ఈ పవిత్రమైన రోజున శ్రావణ మాసం పూర్ణిమ తిథిని జరుపుకున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 31న‌ జరుపుకున్నారు.

తెలుగు సినీసెల‌బ్రిటీలంతా రాఖీ పండుగ‌ను ఎంతో వైభ‌వంగా జ‌రుపుకున్నారు. మెగా ఫ్యామిలీలో సిస్ట‌ర్స్ అంతా త‌మ సోద‌రుల‌కు రాఖీలు క‌ట్టారు. మెగాస్టార్ చిరంజీవి- నాగ‌బాబు- ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా రామ్ చ‌ర‌ణ్- వ‌రుణ్ తేజ్ ఇత‌ర మెగా హీరోల‌కు సోద‌రీమ‌ణులు రాఖీలు క‌ట్టి ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యంగా సోద‌రీమ‌ణుల్లో నిహారిక కొణిదెల‌, రాశీ ఖ‌న్నా, పూజా హెగ్డే, శివానీ రాజ‌శేఖ‌ర్, నిఖితా రెడ్డి, శ్రీ‌ముఖి త‌దిత‌రుల ఫోటోలు వారి సోద‌రుల‌తో పాటు ఉన్న‌వి సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. నిహారిక - వ‌రుణ్ తేజ్, నిహారిక‌- రామ్ చ‌ర‌ణ్, నిఖితా రెడ్డి- నితిన్, విశ్వ‌క్ సేన్ త‌న‌ సోద‌రి మ‌ధ్య అనుబంధానికి సంబంధించిన ఫోటోలు జోరుగా వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్పీడ్ మీద ఉంది. మ‌న హీరోలంతా క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూళ్ల‌తో ఉన్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని అందుకోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ యూనిక్ క‌థాంశాల‌ను ఎంపిక చేసుకుని, భారీ బ‌డ్జెట్లతో అసాధార‌ణ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. లుక్ ఛేంజ్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తిదీ స‌వాల్ గా మారాయి. నిజానికి ఇది తీవ్రంగా ఒత్తిడిని పెంచేదే. కానీ ఒత్తిళ్ల‌న్నిటికీ ఇలాంటి పండుగ‌లు చెక్ పెడుతుంటాయి. 60 ప్ల‌స్ ఏజ్ లోను చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఇత‌ర అగ్ర హీరోలు ఇటీవ‌ల స్పీడ్ పెంచారు. కానీ మ‌న హీరోలంతా పండుగ‌ల వేళ కుటుంబంతో సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. ద‌స‌రా- సంక్రాంతి- వినాయ‌క చ‌వితి- క్రిస్మ‌స్- రక్షాబంధ‌న్ ఇలా పండ‌గ‌ల‌న్నీ బంధాల్ని పెంపొందించే గొప్ప పండ‌గ‌లు. పండ‌గ‌లు గొప్ప ఎన‌ర్జీ బూస్ట‌ర్లు అన‌డంలో సందేహం లేదు.