Begin typing your search above and press return to search.

మ‌ట‌న్ పై దాడి చేసిన హాట్ బ్యూటీ!

శ్రావ‌ణ మాసం ఎంతో ప‌విత్ర‌మైన‌ది. ఎంతో నియ‌మ నిష్ట‌ల‌తో నెలంతా ఉంటారు. పూర్తిగా శాఖాహారుల‌గా మారిపోతారు.

By:  Tupaki Desk   |   28 July 2025 9:58 AM IST
మ‌ట‌న్ పై దాడి చేసిన హాట్ బ్యూటీ!
X

శ్రావ‌ణ మాసం ఎంతో ప‌విత్ర‌మైన‌ది. ఎంతో నియ‌మ నిష్ట‌ల‌తో నెలంతా ఉంటారు. పూర్తిగా శాఖాహారుల‌గా మారిపోతారు. భ‌ర్త యోగ క్షేమాల కోసం చేసే ప్ర‌త్యేక‌మైన పూజ ప్ర‌తీ శుక్ర‌వారం ఎంతో నిష్ట‌తో చేస్తుంటారు మ‌హిళ‌లు. నీచి అనే వాస‌నే ద‌రి చేర‌నివ్వ‌రు. అలాంటి మాసాన్ని అప‌విత్రం చేసింది బాలీవుడ్ న‌టి త‌ను శ్రీ ద‌త్తా. అంద‌రితో పాటు తాను కూడా శ్రావ‌ణ మాసం చేసింది. కానీ అది కొన్ని గంట‌లు మాత్ర‌మే. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఎంతో నిష్ట‌తో ఉప‌వాసం ఉంది.

కానీ సాయంత్రం అయ్యే స‌రికి మ‌ట‌న్ పై దాడి చేసింది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా తెలిపింది. 'రోజంతా శ్రావ‌ణ మాసం చేసాను. కానీ సాయంత్రం మాత్రం మ‌ట‌న్ షాప్ కెళ్లి మ‌ట‌న్ తెచ్చుకుని వండుకుని తిన్న‌ట్లు తెలిపింది. మ‌ట‌న్ కాంబినేష‌న్ గా రైస్ లో రుచిక‌ర‌మైన ప‌ప్పు చేసుకున్నానంది. ఎవ‌రైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసే లా ప్ర‌య‌త్నిస్తే పుల్ గా తిన‌డంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆహార‌మే అస‌లైన మెడిసిన్. శ్రావ‌ణ మాసం కావ‌డంతో ఏడు గంట‌ల వ‌ర‌కూ ఉప‌వాసం ఉన్నాను.

ఉప‌వాసం మ‌రీ క‌ఠినంగా చేయాల్సిన ప‌నిలేదు. ఎవ‌రు అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు వారు మార్చుకోవ‌చ్చు. నా కైతే ఇలాంటి ఉప‌వాస‌మే బాగా ప‌ని చేస్తుంది అంది. అయితే త‌ను శ్రీ ద‌త్తా తీరుపై కొంద‌రి నెటి జ‌నులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంతో ప‌విత్ర‌మైన శ్రావ‌ణ మాసాన్ని అప‌విత్రం చేసింద‌ని మ‌డిపడుతు న్నారు. మ‌హిళ‌లు ఎంతో ప‌విత్రంగా చేసే మాసాన్ని కించ ప‌రిచింద‌ని పోస్టులు పెడుతున్నారు. ఓ వ్య‌క్తి నువ్వు ఎక్కువ‌గా కొవ్వు తింటున్నావ్ అని పెట్ట‌గా...దానికి త‌ను శ్రీ ఇలా స్పందించింది.

'నా శ‌రీరం గురించి కామెంట్ చేసే హ‌క్కు నీకు లేదు. నేను ఎలాంటి డ్రెస్ లు వేసుకున్నా అందంగానే క‌నిపిస్తాను` అంది. త‌ను శ్రీ ద‌త్తా తీరును రాంగో పాల్ వ‌ర్మ వైఖ‌రితో ముడి పెడుతున్నారు. గ‌తంలో ఆయ‌న హిందు దేవుళ్ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నారు. కొంత కాలంగా త‌ను శ్రీ ద‌త్తా బాలీవుడ్ లో లైంగిక ఆరోప‌ణ‌లు కార‌ణంగా వివాదాస్పందంగా మారిన సంగ‌తి తెలిసిందే.