సొంత ఇంట్లోనే తను శ్రీ దత్తా నరకం!
బాలీవుడ్ నటి తను శ్రీదత్తా మీటూ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా ఎంత సచంలనమైందో తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2025 12:18 PM ISTబాలీవుడ్ నటి తను శ్రీదత్తా మీటూ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా ఎంత సచంలనమైందో తెలిసిందే. ఆమె స్పూర్తితో ఎంతో మంది బాధిత మహిళలకు మీడియా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గళ మెత్తారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో తను శ్రీ పై ఎలాంటి దాడులు జరిగాయన్నది? దేశ వ్యాప్తంగా ఎంతో సంచ లనమైంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై తను శ్రీ చేసిన ఆరోపణలపై పెద్ద చర్చే జరిగింది. ఆ సంగతి పక్కనబెడితే.. తాజాగా తను శ్రీ దత్తా మరోసారి వార్తల్లొకి ఎక్కింది.
ఆరు సంవత్సరాలుగా ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆవేదన చెందింది. దీనికి సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో తను శ్రీ కన్నీటి పర్యంతం అవుతూ మాట్లాడింది. 'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏం మాట్లాడలేను. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. పోలీసులకు ఫోన్ చేసాను. వారు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయమంటున్నారు. వీలు చూసుకుని వెళ్తాను. భద్రత లేకుండా పోయింది. ఇంటికొచ్చి మరీ వేదిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.
నా ఆరోగ్యం కూడా క్షీణించింది. పని మనిషిని కూడా పెట్టుకోలేకపోయాను. గతంలో వచ్చిన పని మను షులు వస్తువులు దొంగిలించారు. దీంతో ఇప్పుడన్నీ పనులు నేనే చేసుకుంటున్నానన్నారు. అలాగే మరో వీడియోలో రాత్రివేళలో తన ఇంటి బయట వినిపించే శబ్ధాలను రికార్డు చేసి పోస్ట్ చేసి మరింత ఆందోళ నకు గురి చేస్తున్నారంది. `నిద్రలేక, ప్రశాంతత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఇది కూడా వేధింపుల భాగమేనని అభిప్రాయపడింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో? నెటి జనులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎంతో బాధాకరమైన విషయం. ఆమెకు తక్షణ సహాయం అందాలి. ఒక నటికి భద్రత లేకపోవడం అన్నది అత్యం హేయమైన చర్య. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గతంలో ఆమె చేసిన లైంగిక ఆరోపణల్లో భాగంగానే ఆమె ప్రత్యర్ధులు ఇలాంటి దాడులకు దిగుతున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
