Begin typing your search above and press return to search.

శివపుత్రుడు తరహాలోనే తంగలాన్.. రిస్కేమో?

టీజర్ లాంచ్ సందర్భంగా విక్రమ్ ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఇంటరెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:11 AM GMT
శివపుత్రుడు తరహాలోనే తంగలాన్.. రిస్కేమో?
X

చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ తంగలాన్. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ టీజర్ ని తాజాగా లాంచ్ చేశారు. తంగలాన్ కమ్యూనిటీ తమ కోసం తాము చేసుకున్న పోరాటమే ఈ సినిమాగా కనిపిస్తోంది. పా రంజిత్ సినిమాలు అంటేనే క్రింది స్థాయిలో అట్టడుగు వర్గాల తిరుగుబాటు నేపథ్యంలోనే ఉంటాయి.

అలాగే తంగలాన్ కోసం ఏకంగా పీరియాడిక్ జోనర్ లోకి వెళ్ళిపోయి ఒక అడవితెగకి చెందిన రియల్ స్టొరీని తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో విక్రమ్ చివరి వరకు కేవలం ఒక చిన్న గోచితోనే కనిపిస్తూ ఉండటం విశేషం. టీజర్ అయితే ఇంటరెస్టింగ్ గా ఉంది. విక్రమ్ నుంచి రాబోతున్న మరో ప్రయోగాత్మక చిత్రంగా తంగలాన్ ఉండబోతోందని చెప్పొచ్చు.

టీజర్ లాంచ్ సందర్భంగా విక్రమ్ ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఇంటరెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ మూవీలో కూడా శివపుత్రుడు తరహాలో తన పాత్రకి అసలు డైలాగ్స్ ఉండవని క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే క్యారెక్టర్ కూడా శివపుత్రుడు, అపరిచితుడు, ఐ తరహాలో చాలా కొత్తగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

అయితే శివపుత్రుడు సినిమాలో డైలాగ్స్ లేకుండా పాత్ర ఉన్న కూడా దర్శకుడు బాలా ఆ క్యారెక్టర్ లో అద్భుతమైన ఎమోషన్స్ ని క్యారీ చేశాడు. ఆ పాత్రకి బలాన్ని ఇచ్చే విధంగా సూర్య, సంగీత, లైలా పాత్రలు ఉంటాయి. పా రంజిత్ కి కథని అద్భుతంగా రెడీ చేసుకున్న దానిలో ఉండే ఎమోషన్స్ ని అనుకున్న స్థాయిలో క్యారీ చేయలేడనే అభిప్రాయం కాలా, కబాలి సినిమాలు చూసిన వారికి అనిపించింది.

అయితే తంగలాన్ సినిమాలో పాత్రని కూడా శివపుత్రుడు రేంజ్ లో అద్భుతమైన ఎమోషన్స్ తో ఆవిష్కరించగలిగితే మూవీ జనాల్లోకి వెళ్తుంది. ఆ పాత్రని ప్రెజెంట్ ఆడియన్స్ ఏ స్థాయిలో రిసీవ్ చేసుకోగలరు అనేది చూడాలి. ఒక వేళ క్యారెక్టర్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయితే మాత్రం కచ్చితంగా తంగలాన్ సినిమా విక్రమ్ ని పాన్ ఇండియా స్థాయిలో గొప్పగా రిప్రజెంట్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.