Begin typing your search above and press return to search.

తండేల్.. పోస్టర్ తోనే ఊహించని బజ్

చందు మొండేటి దర్శకత్వంలో చైతు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్' సినిమా పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Nov 2023 8:51 AM GMT
తండేల్.. పోస్టర్ తోనే ఊహించని బజ్
X

అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు రాబోయే సినిమా మరొక లెక్క అనే విధంగా 23వ సినిమా రూపొందుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో చైతు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్' సినిమా పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి.


ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. ఇక నాగచైతన్య కూడా ప్రత్యేకంగా ఈ సినిమాలోని పాత్ర కోసం వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నాడు.


శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో కొంతమంది మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో నాగచైతన్య కనిపించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. పవర్ ఫుల్ ఫిట్నెస్ తో గతంలో ఇప్పుడు లేనివిధంగా నాగచైతన్య మాసివ్ లుక్ తో ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఊహించని విధంగా ఉంటుంది అని క్లారిటీ వచ్చేసింది.

అయితే ఇప్పుడు ఆ పోస్టర్ ద్వారానే అన్ని వైపులా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. తండేల్ పోస్టర్ కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కూడా దేశంలో ఉన్న ఇతర అభిమానులను కూడా ఎంతగానో నచ్చేసింది. ఇక రీసెంట్గా న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లోనే బిల్ బోర్డులో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రదర్శించారు. దీంతో ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ ఏ విధంగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా ఉండగా అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాను నాగచైతన్య కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా రాక్ స్టాప్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతకుముందు దేవిశ్రీప్రసాద్ నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ గా నిలిచాయి.

ఇక ఈ పాన్ ఇండియా తండేల్ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చిత్ర యూనిట్ ఒక ప్లాన్ అయితే వేసుకుంది. ఇక అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ విడుదల టేప్ పై కూడా త్వరగానే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి నాగచైతన్య కెరీర్ ను ఈ సినిమా ఏ రేంజ్ కు తీసుకు వెళుతుందో చూడాలి.