Begin typing your search above and press return to search.

తండేల్: ఆ స్లాంగ్ కోసం సాయి పల్లవి కష్టాలు !

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీ తండేల్. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:08 AM GMT
తండేల్: ఆ స్లాంగ్ కోసం సాయి పల్లవి కష్టాలు  !
X

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీ తండేల్. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. సాయి పల్లవి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా కనిపించబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే సినిమాలో సాయి పల్లవి పాత్ర గురించి దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు. ఆమె శ్రీకాకుళంకి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో సినిమాలో కనిపించబోతోంది. ఆమె పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అలాగే పక్కా శ్రీకాకుళం స్లాంగ్ లోనే ఆమె పాత్ర సంభాషణలు కూడా ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.

ఇక పాత్ర పెర్ఫెక్షన్ కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకుంటుంది. దీనికోసం వర్క్ షాప్ కూడా కండెక్ట్ చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆమె పాత్ర మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తుందని, కచ్చితంగా తండేల్ చిత్రంలో కొత్త సాయిపల్లవిని చూస్తారని చందూ చెప్పుకొచ్చారు. హీరో నాగ చైతన్యని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తుందని అన్నారు.

అలాగే తన హక్కుల కోసం పోరాడే డేరింగ్ విమెన్ పాత్రలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ని కూడా ఇవ్వనుందని చందూ తెలిపారు. ఇక మూవీలో సాయి పల్లవి పాత్ర అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. విరాటపర్వం, లవ్ స్టొరీ చిత్రాల తర్వాత సాయి పల్లవి చాలా గ్యాప్ తీసుకొని తండేల్ మూవీకి ఒకే చెప్పింది. ఈ మధ్యలో చాలా ఆఫర్స్ తిరస్కరించింది.

దీనిని బట్టి ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎంత గొప్పగా ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఫిదా సినిమా కోసం తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని పెర్ఫెక్ట్ గా భానుమతి క్యారెక్టర్ ని న్యాయం చేసిన సాయి పల్లవి తండేల్ లో సిక్కోలు యువతిగా జీవించేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.