Begin typing your search above and press return to search.

తండేల్.. నాగచైతన్య పవర్ఫుల్ మాస్

ఇక నాగ చైతన్య పుట్టినరోజు పుట్టినరోజు కంటే ఒక రోజు ముందు మేకర్స్ సినిమా టైటిల్ తో పాటు నాగచైతన్య ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. తాండెల్ అని ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 9:37 AM GMT
తండేల్.. నాగచైతన్య పవర్ఫుల్ మాస్
X

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య 23వ సినిమా గాసిప్స్ తోనే హై రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఇక అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై భారీ కాన్వాస్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


ఇక నాగ చైతన్య పుట్టినరోజు పుట్టినరోజు కంటే ఒక రోజు ముందు మేకర్స్ సినిమా టైటిల్ తో పాటు నాగచైతన్య ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. తాండెల్ అని ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో నాగ చైతన్య వీరత్వం హైలెట్ అయ్యేలా టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు అనిపిస్తుంది. టైటిల్‌ను జస్టిఫై చేస్తూ, నాగ చైతన్య పోస్టర్ లో దమ్మున్న వ్యక్తిగా హైలెట్ అవుతున్నాడు.

చైతు మత్స్యకారుని పాత్ర కోసం పూర్తి పూర్తి స్థాయిలో మెకోవర్ చేంజ్ చేశాడు. ఒక సాధారణ మత్స్యకారుని వలె డ్రెస్సింగ్ స్టైల్ అలాగే తన పవర్ఫుల్ బాడీని హైలెట్ చేశాడు. ఫస్ట్ లుక్ లో అయితే నాగచైతన్య ఆశ్చర్యానికి గురి చేశారు. పాన్ ఇండియా రేంజ్ కు ఈ కంటెంట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనేలా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించడానికి దేవి శ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేశారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్. వచ్చే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సినిమా కథ విషయానికి వస్తే.. 2018లో సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గోర్డ్ లకు బందీలుగా చిక్కి దాదాపు సంవత్సరం పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. అయితే వారి జీవిత ఆధారంగానే ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు.

ఇక ఈ సినిమా లుక్కు కోసమే చైతూ పూర్తిగా మారిపోయాడు. చూస్తుంటే ఒక లోకల్ మత్స్యకారుడిగా నాగచైతన్య రియాలిటీ కి తగ్గట్టుగా తనను తాను చేంజ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు అని క్లారిటీ అయితే వస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.