Begin typing your search above and press return to search.

లైవ్ పెర్పార్మెన్స్ లో బాబి-2 చింపేసిందిగా!

ఆన్ స్క్రీన్ పై ర‌ణ‌బీర్-తృప్తి డిమ్రి మ‌ధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో పండిందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:13 AM GMT
లైవ్ పెర్పార్మెన్స్ లో బాబి-2 చింపేసిందిగా!
X

ఆన్ స్క్రీన్ పై ర‌ణ‌బీర్-తృప్తి డిమ్రి మ‌ధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో పండిందో చెప్పాల్సిన ప‌నిలేదు. డిమ్రి ఎంట్రీ క‌నిపించినంత సేపు తెరంతా రొమాన్స్ తోనే నిండిపోయింది. వాళ్లిద్దరి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్ష‌కులు అదే స్థాయిలో ఆస్వాదించారు. ఇంకా కాసేపు ఆ జోడీ క‌నిపిస్తే బాగుండని అనుకోని ప్రేక్ష‌కుడు అంటూ లేడు. ఆ స‌న్నివేశాలు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.

ఏ సినిమా తీసుకురాని గుర్తింపును `యానిమ‌ల్` తృప్తి డిమ్రీకి తీసుకొచ్చింది. ఆ స‌క్సెస్ తోనే వ‌రుస‌గా రెండు కొత్త సినిమాల‌కు సైతం సైన్ చేసింది. ఇప్పుడు తృప్తీ డిమ్రి అంటే కుర్ర‌కారులో ఓ ఐకాన్ గా మారిపోయింది. మ‌రి అలాంటి రీల్ జోడీ..లైవ్ పెర్పార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ జోడీ పెర్పార్మెన్స్ ని లైవ్ చూసిన వారు ఇంకెంత స‌ర్ ప్రైజ్ అవ్వాలి. అంటే 69వ ఫిలిం ఫేర్ వేడుక‌ల్లో ఇదే స‌న్నివేశం క‌నిపించింది.

ర‌ణ‌బీర్-తృప్తి ఇద్ద‌రు యానిమ‌ల్ లోని 'పెహ్లే భీ మైన్స పాట‌కు స్టేజ్ పై లైవ్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టు కున్నారు. అందులోనూ తృప్తి అయితే అద‌ర‌గొట్టేసింద‌నొచ్చు. అమ్మ‌డు ఓ రేంజ్ లో లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చింది. ఎరుపు వ‌ర్ణం గౌనులో దూరిపోయిన అమ్మ‌డు అలా స్టేజ్ పై క‌నిపించే స‌రికి ఒక్క‌సారిగా మోతెక్కిపోయింది. అందం..అభిన‌యం ...రణ‌బీర్ తో స్టేజ్ ని పంచుకుని వేదిక‌కే వ‌న్నె తీసుకొచ్చింది. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

స్టేజ్ పై ఇద్ద‌రు మ‌రోసారి ఇఒంటిమేట్ రొమాన్స్ తో చింపేసారు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వావ్ అనిపించింది. ఇక సోష‌ల్ మీడియాలో నెటి జ‌నుల కామెంట్ల వ‌ర్షానికైతే కొద‌వే లేదు. ర‌ణ‌బీర్ కి తృప్తిని భాబీ2 ని చేసే సారు. ర‌ణ‌బీర్ తృప్తిని అలా చేతుల్లోకి తీసుకుని పైకెత్తి..ఇద్ద‌రు ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటూ పెర్పార్మెన్స్ చేసిన వైనం వావ్ అనిపిస్తుంది. కుర్రాళ్ల‌తో విజిల్స్ వేయిస్తుంది ఆ దృశ్యం. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ పుల్ లెంగ్త్ రొమాంటిక్ సినిమా చేస్తే 1000 కోట్లు ఖాయ‌మే సుమీ.