పవన్ మూవీ ఆపే మగాడు లేడు: తమ్మారెడ్డి భరద్వాజ
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 27 May 2025 9:48 AM ISTతెలుగు సినీ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన రావడం.. ఆ తర్వాత లేదని ప్రకటించడం.. డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అవ్వడం.. హరిహర వీరమల్లు ఎందుకు ఇలా జరిగిందని విచారణకు ఆదేశించడం.. అవన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ మూవీ ఆపే మగాడు లేడని వ్యాఖ్యానించారు. "దేవర రిలీజ్ ముందు సినిమా ఆపేస్తామన్నారు.. పుష్ప సినిమా ముందు కూడా అలానే అన్నారు.. ఏమైనా చేశారా.. రెండు సినిమాలు కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి.. ఇప్పుడు పవన్ చిత్రం ముందు అన్నారు. ఎవరేం చేయగలరు.. అంత మగాడు ఎవరున్నాడు.. ఎవరో ఏం పని లేని వాళ్లు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు" అని తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
"సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటే ఉండవచ్చు.. కానీ పవన్ గారి చుట్టూ ఉన్న రాజకీయం అది కాదు.. ఎందుకంటే ఆ నలుగురు అంటున్నారు కదా.. ఆ నలుగురిలో ఒకరిది మూవీ కుబేర కూడా ఉంది. ఇదే టైమ్ లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్ మూసివేస్తే వాళ్లకు లాస్ ఉంటుంది కదా.. అందుకే సమస్య అది కాన్నట్లు ఉంది" అని తెలిపారు.
"సమస్య ఇంకేదో ఉంది.. ఆ నలుగురిలో ఉన్న అంతర్గత సమస్యలున్నాయేమో.. అల్లు అరవింద్ గారు పది మంది అంటున్నారు.. గతంలో ఆయన నలుగురిలో ఉన్నారు కదా.. ఇప్పుడు కుట్రలో ఉన్నారా లేదా అన్నది పాయింట్ కాదు. ఇండస్ట్రీని కంట్రోల్ చేసి శక్తుల్లో ఆయన ఒకరు. అల్లు అరవింద్ తోపాటు అనేక మంది ఉన్నారు" అని చెప్పారు.
"సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ మూవీ మేకర్స్, నాగవంశీ.. రెగ్యులర్ మూవీ తీస్తున్న వాళ్లే నాయకులు.. 200 సినిమాలు వస్తే వాళ్లవి 50 చిత్రాలు ఉంటాయి. వాటిపైనే ఫోకస్ ఉంటుంది. అందుకే వాళ్ల మధ్యలో ఏమైనా ఉందా అనేది డౌట్. కానీ నాకు క్లియర్ గా తెలియదు. నేను ఈ మధ్య సరిగ్గా పట్టించుకోవడం లేదు" అని అన్నారు.
"ఇండస్ట్రీని రిఫ్లెక్ట్ చేసేది ఛాంబర్, కౌన్సిల్ సహా పలు సంఘాలు. కానీ గత 15 ఏళ్ల నుంచి చూసుకుంటే.. కొంతమంది వ్యక్తులు వాళ్లకు నచ్చిన గవర్న్మెంట్ దగ్గరకు వెళ్లి నచ్చిన పనులు చేసుకుంటున్నారు. వాళ్లే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లు.. మిగతా వాళ్లు కాదు అన్న పరిస్థితిని ఇప్పుడు ఇండస్ట్రీలోకి తెచ్చారు" అని వ్యాఖ్యానించారు
"అలా ఇండస్ట్రీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. దీంతో వాళ్లు వస్తే.. వీళ్లు.. వీళ్ళు వస్తే వాళ్లను తిడుతున్నారు. దీంతో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అప్పుడు ఎన్టీఆర్ టీడీపీ అయినా.. కృష్ణ కాంగ్రెస్ అయినా కలిసినప్పుడు పట్టించుకునేవారు.. పలకరించుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. కనీసం ముఖాలు చూసుకోవడం లేదు" అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.
