Begin typing your search above and press return to search.

రోజులో 50 లక్షల సభ్యత్వం.. దళపతి పార్టీలో స్టార్ తనయుడు..!

విజయ్ పిలుపు మేరకు 24 గంటల్లోనే 50 లక్షలకు పైగా సభ్యత్వం పొందారు. వారిలో ఎక్కువ శాతం యువతీ యువకులే ఉన్నట్టు తెలుస్తుంది

By:  Tupaki Desk   |   15 March 2024 3:30 AM GMT
రోజులో 50 లక్షల సభ్యత్వం.. దళపతి పార్టీలో స్టార్ తనయుడు..!
X

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ రీసెంట్ గా తన రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రిక్ కళగం పార్టీ పేరుని ప్రకటించి తన రాజకీయ అరంగేట్రం పై అధికారిక ప్రకటన చేశాడు విజయ్. తమిళం లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కొన్నాళ్లుగా పాలిటిక్స్ లోకి వస్తారని వార్తలు వచ్చినా ఆయన టైం చూసుకుని పార్టీ ప్రకటన చేశారు. అయితే విజయ్ పార్టీ ప్రకటించడమే కాదు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మొదలు పెట్టాడు.

విజయ్ పిలుపు మేరకు 24 గంటల్లోనే 50 లక్షలకు పైగా సభ్యత్వం పొందారు. వారిలో ఎక్కువ శాతం యువతీ యువకులే ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ పార్టీలో సభ్యత్వం పొందాడు ప్రముఖ సౌత్ యాక్టర్ నాజర్ తనయుడు నూరుల్ హాసన్ ఫైజల్. నాజర్ కొడుక్కి యాక్సిడెంట్ వల్ల ఆరోగ్యం క్షీణించింది. అయినా సరే విజయ్ మీద అభిమానంతో ఆయన పార్టీలో చేరినట్టు నాజర్ భార్య కెమిలా వెల్లడించారు.

నాజర్ తనయుడు చిన్నప్పటి నుంచి విజయ్ కు పెద్ద అభిమాని.. కొన్నేళ్ల క్రితం అతను యాక్సిడెంట్ కు గురి కావడంతో ఎవరినీ గుర్తుపట్టలేదు కానీ విజయ్ సార్ ని గుర్తు పట్టాడు. పేరెంట్స్ ని కూడా గుర్తుపట్టలేని అతను విజయ్ ని గుర్తు పట్టాడంటే అతనికి విజయ్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత విజయ్ సార్ మా ఇంటికి వచ్చి నూరుల్ హాసన్ ఫైజల్ ని కలిశారని అతనికి ధైర్యం చెప్పారని నాజర్ సతీమణి చెప్పారు.

తమ బిడ్డ ఇలా ఉన్నాడంటే దానికి విజయ్ సార్ కారణమని నాజర్ కూడా చెప్పారు. విజయ్ పార్టీ పెట్టి తన అభిమానులకు పిలుపు ఇవ్వడంతో తన కుమారుడు ఫైజల్ సభ్యత్వం తీసుకున్నాడని నాజర్ వెల్లడించారు. విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావాలని ఆయన చెప్పారు. సినీ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు అయితే వచ్చిన వారు ఇక్కడ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారు అన్నది ముఖ్యం. మన దగ్గర కూడా జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు మరి ఇక్కడ పవన్ కి సాధ్యం కానిది అక్కడ విజయ్ కు సాధ్యమవుతుందా అన్నది చూడాలి.