Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. తమిళ సినిమాల లెక్క ఎలా ఉందంటే?

ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Jan 2024 11:03 AM GMT
బాక్సాఫీస్.. తమిళ సినిమాల లెక్క ఎలా ఉందంటే?
X

ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అలాగే రెండింటికి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ధనుష్, శివ కార్తికేయన్ ఈ ఇద్దరికీ కోలీవుడ్లో ఈక్వల్ మార్కెట్ తో పాటూ అదే రేంజ్ లో స్టార్ డమ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోల్లో ఈ సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక తమిళనాట 'కెప్టెన్ మిల్లర్' రూ.6.5 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటే శివ కార్తికేయన్ 'అయలాన్' మొదటి రోజు మాత్రం రూ.3.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కెప్టెన్ మిల్లర్ కి రూ.13 కోట్ల రేంజ్ లో గ్రాస్ 'అయలాన్' కి దాదాపు రూ.6.7 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 'కెప్టెన్ మిల్లర్' 'అయలాన్' కంటే రెట్టింపు ఓపెనింగ్స్ నమోదు చేసింది.

నిజానికి రిలీజ్ కు ముందు ఈ రెండు సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో అధికాస్త కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోల మార్కెట్ ని బట్టి చూస్తే రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని అందుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. ఇక శివ కార్తికేయన్ 'అయలాన్' కోలీవుడ్ లో ఈరోజు మంచి ఆక్యుపెన్సీ ని కలిగి ఉంది.

అటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఆక్యుపెన్సీ కూడా దాదాపు ఒకే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాల బుకింగ్స్ ని బట్టి రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి.కాగా ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో రూపొందినవే. ఇందులో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' పీరియాడికల్ యాక్షన్ డ్రామా అయితే శివ కార్తికేయన్ 'అయలాన్' సైన్స్ ఫిక్షన్ మూవీ.

ఈ రెండు సినిమాల్లోనూ రెండు బలమైన మెసేజ్లు ఉన్నాయి. కెప్టెన్ మిల్లర్ విషయానికొస్తే.. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ తో సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ శివ రాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్ కీలకపాత్రలు పోషించారు. ఇక అయలాన్ లో శివ కార్తికేయన్ కి జోడిగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్ ప్రముఖ పాత్రల్లో కనిపించారు.