Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: డియ‌ర్ తంబీలూ ఇదేనా సోద‌ర‌భావం?

భార‌త‌దేశంలో ఉత్త‌రాది- ద‌క్షిణాది డివైడ్ అనేది ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. దిల్లీ పాల‌కులు ఉత్త‌రాదికి ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను ద‌క్షిణాదికి ఇవ్వ‌ర‌నేది కూడా తెలిసిన‌దే

By:  Tupaki Desk   |   27 Sep 2023 1:30 AM GMT
ట్రెండీ టాక్: డియ‌ర్ తంబీలూ ఇదేనా సోద‌ర‌భావం?
X

భార‌త‌దేశంలో ఉత్త‌రాది- ద‌క్షిణాది డివైడ్ అనేది ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. దిల్లీ పాల‌కులు ఉత్త‌రాదికి ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను ద‌క్షిణాదికి ఇవ్వ‌ర‌నేది కూడా తెలిసిన‌దే. భార‌తీయ సినిమా వందేళ్లు పైగా మ‌నుగ‌డ‌ను సాగించ‌గా ఇందులో 90ఏళ్ల పాటు తెలుగు సినిమా మ‌నుగ‌డ‌ను సాగించింది. దిన‌దినాభివృద్ధి చెందింది. ఇన్నాళ్టికి సౌత్ ట్యాలెంట్ గొప్ప‌త‌నాన్ని ముంబై ప‌రిశ్ర‌మ అర్థం చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఖాన్ ల త్ర‌యం స‌హా చాలామంది అగ్ర హీరోలు మ‌న ప్ర‌తిభ‌ను ఎంక‌రేజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అయితే సౌత్ సినీప‌రిశ్ర‌మ‌లు ఇంత ఎదిగినా కానీ ఇంకా అసూయ అనేది అక్క‌డ అలానే ఉంది. ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి- బాహుబ‌లి 2 చిత్రాలు కానీ, య‌ష్ న‌టించిన కేజీఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు సాధించిన పాన్ ఇండియా విజ‌యాల్ని ముంబై ప‌రిశ్ర‌మ‌ అంత తేలిగ్గా డైజెస్ట్ చేసుకోలేద‌నది నిజం. పుష్ప 2లో న‌ట‌న‌కు అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్న‌ప్పుడు బాలీవుడ్ లో స్పంద‌న అంతంత మాత్ర‌మే.

ఇది కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ వ‌ర‌కే ప‌రిమితం కాదు. ఇటు ద‌క్షిణాదిన దాయాదులు అయిన త‌మిళులు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. తంబీలు తొలి నుంచి ప్రాంతీయ భావంతో ఉన్నారు. అసూయ ద్వేషాల‌ను దాచుకోలేదు. ఇరుగు పొరుగు భాష‌ల నుంచి వ‌చ్చిన సినిమాల‌ను వారు ఎంక‌రేజ్ చేయ‌డం లేదు. య‌థావిధిగా ప్ర‌భాస్- య‌ష్ లాంటి హీరోల ఎదుగుద‌ల కూడా తంబీల‌కు అంత‌గా గిట్ట‌లేదు. బాహుబ‌లి- కేజీఎఫ్ లాంటి సినిమాలు అక్క‌డ ఇత‌ర భాష‌ల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఆడాయి. క‌లెక్ష‌న్లు అంతంత‌మాత్ర‌మే.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళ తంబీలు స‌రైన పాన్ ఇండియా హిట్టు ఒక్క‌టి కూడా కొట్ట‌లేక‌పోవ‌డం వారికి జీర్ణం కానిద‌ని చెప్పాలి. చాలా కాలానికి ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ ఇత‌ర సినిమాల‌తో పోలిస్తే ఉత్త‌మ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా ఇరుగు పొరుగు భాష‌ల్లోను బాగానే ఆడింది. అయితే త‌మిళుల సినిమాలు తెలుగు లేదా హిందీలో గొప్ప వ‌సూళ్ల‌ను సాధించ‌గ‌ల‌వు. దానికి విరుద్ధంగా తెలుగు, త‌మిళ సినిమాలు త‌మిళ‌నాడులో అంత గొప్ప వ‌సూళ్ల‌ను సాధించిన దాఖ‌లాలు లేవు. దీనికి కార‌ణం తంబీలు ఎంతో క్లారిటీగా నేటివిటీ సినిమాకి మాత్ర‌మే ప్రోత్సాహం అందించ‌డం. అయితే ఉత్త‌రాదిన భాష‌తో సంబంధం లేకుండా సినిమాల్ని ఆద‌రిస్తున్నారు. కానీ త‌మిళ తంబీల్లో క‌నీస‌మాత్రానికైనా సోద‌ర‌భావం లేక‌పోవ‌డం గ‌ర్హించ‌ద‌గిన‌ది.

ప్ర‌భాస్ స‌లార్‌కి తంబీల సెగ‌:

ఇప్పుడు ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ కి కూడా త‌మిళ తంబీల ప్రాంతీయ సెగ తాక‌నుందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. తాజాగా డార్లింగ్ సినిమాని డిసెంబ‌ర్ 22న క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇదే తేదీన షారూఖ్ ఖాన్ న‌టించిన డుంకీ సినిమా విడుద‌ల‌వుతోంది. ఇరు సినిమాల న‌డుమా వార్ డిక్లేర్ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లో దేనికి త‌మిళ తంబీల స‌పోర్ట్ ఉంటుంది? అంటే.. కచ్ఛితంగా డుంకీ సినిమాకే అని తంబీలు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

డుంకీని చూస్తామని, సాలార్‌ను కాదని తమిళ అభిమానులు సోషల్ మీడియాలో ప్రతిజ్ఞ చేశారు. అయితే జానర్ ప‌రంగా చూస్తే డుంకీ అనేది తమిళ ప్రేక్షకులు మెచ్చేది కాదు. స‌లార్ లాంటి మాస్ యాక్ష‌న్ సినిమాని భాష‌తో సంబంధం లేకుండా వీక్షించే ఛాన్సుంది. కానీ తంబీలు ఆ ప‌ని చేయ‌రట‌. త‌మిళులు ఇప్పటికీ అభద్రతాభావం అసూయతో ఉన్నారు. ప్రభాస్ సినిమాని చూడ‌మ‌ని చెబుతున్నారు. అయితే డార్లింగ్ ప్ర‌భాస్ త‌నని ప‌ట్టి కిందికి లాగాల‌నుకునే వారికి త‌న‌దైన శైలిలో జ‌వాబిస్తాడని అభిమానులు న‌మ్ముతున్నారు. త‌మిళ తంబీల నేటివిటీ ఫీలింగ్ ఇటీవ‌ల వారి మెడ‌కే చుట్టుకుంటోంద‌న‌డంలో సందేహం లేదు. ఒక బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలో భారీ పాన్ ఇండియా సినిమాల‌ను తమిళులు ఇప్ప‌ట్లో తెర‌కెక్కించ‌డం అసాధ్యం. మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే ఆ రెండు సినిమాలు ట‌చ్ కూడా చేయ‌లేద‌న్న‌ది వాస్త‌వం.