Begin typing your search above and press return to search.

తమిళ కమెడియన్ పాన్ ఇండియా క్రేజ్..!

కోలీవుడ్ లో కమెడియన్స్ కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అక్కడ కమెడియన్స్ ని ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 10:49 AM GMT
తమిళ కమెడియన్ పాన్ ఇండియా క్రేజ్..!
X

కోలీవుడ్ లో కమెడియన్స్ కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అక్కడ కమెడియన్స్ ని ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒకప్పుడు ప్రతి సినిమాలో కనిపించి అలరించే కమెడియన్ సంతానం హీరోగా మారి సత్తా చాటుతున్నాడు. ఇక ఎవర్ గ్రీన్ కామెడీ స్టార్ వడివేలు ఈమధ్య కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రీ ఎంట్రీ కమెడియన్ గా కాకుండా సీరియస్ మూవీతో వచ్చారు వడివేలు. ఇదిలా ఉంటే వడివేలు, వివేక్, సంతానం ఇలా స్టార్ కమెడియన్స్ రేంజ్ కి మరో కమెడియన్ యోగి బాబు చేరుకున్నాడు.

తన లుక్స్ తోనే ప్రేక్షకుల్లో నవ్వు తెప్పించే యోగి బాబు ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈమధ్య ఏ తమిళ సినిమాలో చూసినా సరే యోగి బాబు ఉంటున్నాడు. మన టాలీవుడ్ లో ఒకప్పుడు బ్రహ్మానందం, సునీల్ లేని సినిమాలు రాలేదు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ యోగి బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. యోగి బాబు కూడా తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు.

రీసెంట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ జైలర్ సినిమాలో తన పాత్రతో మెప్పించిన యోగి బాబు త్వరలో రిలీజ్ కాబోతున్న జవాన్ సినిమాలో కూడా నటించాడు. జైలర్ పాన్ ఇండియా హిట్ కాగా షారుఖ్ జవాన్ తో కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటున్నాడు యోగిబాబు. సినిమాలో అతనికి సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుందని సినిమాకు అది బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. జవాన్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో యోగి బాబు ని గ్రాండ్ గా స్టేజ్ మీదకు ఇన్వైట్ చేశారు.

యోగి బాబు పేరు పిలవగానే ఆడిటోరియం లో ఉన్న ఆడియన్స్ అంతా కూడా కేకలు వేశారు. అతనికి ఉన్న క్రేజ్ చూసి షారుఖ్ కూడా షాక్ అయ్యాడు. ఈవెంట్ కి అటెండ్ అయిన యోగి బాబుని ఆత్మీయంగా పలకరించి హగ్ ఇచ్చారు షారుఖ్. జవాన్ తర్వాత బాలీవుడ్ లో కూడా యోగి బాబుకి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ సినిమాలతో యోగి బాబు కామెడీని టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్న షారుఖ్ జవాన్ తెలుగు ప్రమోషన్స్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. షారుఖ్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది.