Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ త‌మిళం ఈ పార్టీలేంటి సారూ?

ఇక తాజా ముగింపు ఉత్స‌వంలో పోటీదారులు, సిబ్బంది స‌హా ఇతర ప్రముఖులు వరుసగా కూర్చొని సాంప్రదాయ థాలీ లంచ్‌ను ఆస్వాధించారు. ఈ ఈవెంట్ సీజన్‌కు ముగింపు ఉత్స‌వంగా నిలిచింది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 9:28 AM GMT
బిగ్ బాస్ త‌మిళం ఈ పార్టీలేంటి సారూ?
X

బిగ్ బాస్ తమిళ్ ఏడవ సీజన్ ఇటీవలే ముగిసింది. రాజా రాణి సీజన్ 2 అర్చనను విజేతగా ప్ర‌క‌టించారు. కమల్ హాసన్ హోస్టింగ్ చేసిన ఈ సీజన్ ముగింపు ఎంతో ఎగ్జ‌యిట్ చేసింది. విక్రమ్ గెట‌ప్‌తో ఈ వేదిక‌పై మెరిపించిన‌ కమల్ హాసన్, బిగ్ బాస్ సీజన్ 7లో సిబ్బందికి పార్టిసిపెంట్‌లకు అద్భుతమైన లంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

కమల్ హాసన్ ఇప్ప‌టికే హోస్ట్‌గా త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. త‌మిళ బిగ్ బాస్ లో ఎదురేలేని హోస్ట్ గా ఆయ‌న‌కు తంబీలు ప‌ట్టంగ‌ట్టారు. ఇక తాజా ముగింపు ఉత్స‌వంలో పోటీదారులు, సిబ్బంది స‌హా ఇతర ప్రముఖులు వరుసగా కూర్చొని సాంప్రదాయ థాలీ లంచ్‌ను ఆస్వాధించారు. ఈ ఈవెంట్ సీజన్‌కు ముగింపు ఉత్స‌వంగా నిలిచింది.

ఆదివారం (జనవరి 14న) ప్రసారమైన చివరి ఎపిసోడ్‌లో మిగిలిన ఇద్దరు పోటీదారులు అర్చన -మణిచంద్రల మధ్య పోటీ జరిగింది. అర్చన చివ‌రికి విజేతగా నిలిచింది. టైటిల్ తో పాటు అర్చ‌న‌ కొత్త ఆటోమొబైల్, 15 లక్షల విలువైన భూమి సహా 50 లక్షల నగదు బహుమతిని పొందింది. గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన గేమ్ ఛేంజర్, స్పోర్టీ కంటెస్టెంట్ ..కంటెస్టెంట్ విత్ డిటర్మినేషన్ వంటి వివిధ అవార్డుల‌తో ఇతర పోటీదారులకు గుర్తింపు లభించింది.

శంకర్ దర్శకత్వంలో 1996 బ్లాక్ బ‌స్ట‌ర్ ఇండియ‌న్ కి సీక్వెల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణను దాదాపు ముగించుకుని, ఎట్టకేలకు విడుదలకు షెడ్యూల్ చేసింది చిత్ర‌బృందం. ఇంకా కమల్ హాసన్ -మణిరత్నం దాదాపు 37 సంవత్సరాల తర్వాత 'థగ్ లైఫ్' పేరుతో భారీ సినిమా చేస్తున్నారు. గౌతమ్ కార్తీక్, జయం రవి, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, త్రిష కృష్ణన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రంగరాజా శక్తివేల్ నాయకర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. కమల్ హాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో కెహెచ్ 233 అనే పేరుతో ఒక భారీ చిత్రంలో కనిపించబోతున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898లో క‌మ‌ల్ విల‌న్ పాత్రలో నటిస్తున్నారు. వీట‌న్నిటినీ మించి బిగ్ బాస్ హోస్ట్ గా ఏజ్ లెస్ క‌మ‌ల్ సంచ‌లనాలు సృష్టిస్తున్నాడు.