కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే డిమాండ్ ఎక్కువా?
ఎంత పెద్ద హీరో అయినా? సొంత పరిశ్రమను వదిలి పరాయి పరిశ్రమలో పని చేసేటప్పుడు పారితోషికం పరంగా కాస్త తగ్గడానికే అవకాశం ఉంటుంది.
By: Srikanth Kontham | 8 Oct 2025 8:00 PM ISTఎంత పెద్ద హీరో అయినా? సొంత పరిశ్రమను వదిలి పరాయి పరిశ్రమలో పని చేసేటప్పుడు పారితోషికం పరంగా కాస్త తగ్గడానికే అవకాశం ఉంటుంది. పర భాషలో పెద్దగా మార్కెట్ ఉండదు కాబట్టి? అక్కడ పరిస్థితిని బట్టి చార్జ్ చేస్తుంటారు. రెండు భాషల కోణంలో డిమాండ్ చేసినా? బిజినెస్ అవ్వదు కాబట్టి డిమాండ్ చేసి రిస్క్ తీసుకో వడానికి ముందుకురారు. అయితే టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోల పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే విజయ్, ధనుష్, కార్తీ, విజయ్ సేతుపతి లాంటి తమిళ నటులు టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
సూర్య కూడా ఎంట్రీ ఇస్తున్నారు. రేపోమాపో అతడి సినిమా కూడా విడుదలవుతుంది. అయితే తాజాగా వీరందరి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ కోలీవుడ్ నయా స్టార్లు అంతా టాలీవుడ్ లో కోలీవుడ్ కంటే అధిక పారితోషికం డిమాండ్ తోనే పని చేసారని కొంత మంది నిర్మాతల నుంచి లీకైంది. అప్పటి పరిస్థితులను బట్టి రెండు భాషల మార్కెట్ ను ఆధారంగా చేసుకుని క్రేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్నారుట. అందుకు తెలుగు దర్శక, నిర్మాతల అత్యుత్సాహ మరో కారణమంటున్నారు.
తెలుగు సినిమా చేయాలని తమిళ హీరోలను ఆహ్వానించడంతోనే ఈ పరిస్థితి దాపరించిందంటున్నారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న నుటల్ని తీసుకురావడంతోనే ఈ సమస్య తలెత్తుందని నిర్మాతల్లో చర్చకు దారి తీసింది. సాధారణంగా ఓ తమిళ హీరో సినిమా తెలుగులో డబ్బింగ్ రూపంలో రిలీజ్ అయితే ఆ సినిమాను బట్టి...హీరో మార్కెట్ ను బట్టి సేల్ ఉంటుంది. అప్పటికే సినిమాపై ప్రీటాక్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా బిజినెస్ డీల్ జరుగుతుంది.
కానీ ఓ తమిళ హీరో తెలుగు లో స్ట్రెయిట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే? గనుక మార్కెట్ ని మించి డిమాండ్ చేస్తు న్నారుట. తమిళ్ రిలీజ్ ఉన్నా? లేకపోయినా తాము డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నారుట. ఇటీవలి కాలంలో ఓ ఇద్దరు హీరోల విషయంలో ఈ సన్నివేశాన్ని ఆ చిత్ర నిర్మాతలు చూసి నట్లు తెలిసింది. తెలుగు సినిమా చేయండి చేయండని ఆహ్వానిస్తే నిర్మాతలంతా ఇలా అధిక మొత్తంలో చదివించుకుంటున్నారని తెలుస్తోంది.
