Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో మాట్లాడ‌ని హీరోయిన్?

ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవ‌రు? ప్ర‌ముఖ హీరోయిన్ ఎవ‌రు? అంటే.. రామ్ చ‌ర‌ణ్ - త‌మ‌న్నా జంట గురించే ఇదంతా. ర‌చ్చ సినిమాలో తొలిసారి జంట‌గా న‌టించారు.

By:  Tupaki Desk   |   2 March 2024 11:30 PM GMT
స్టార్ హీరోతో మాట్లాడ‌ని హీరోయిన్?
X

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న ప్ర‌ముఖ హీరో కం స్టార్ స‌న్ తో ప్ర‌ముఖ క‌థానాయిక మాట్లాడ‌దు. ఆమె మాట్లాడ‌దు గ‌నుక‌.. అత‌డు కూడా భేష‌జానికి పోయాడు. త‌న‌తో రెండు రోజుల పాటు సెట్లో మాట్లాడ‌నే లేదుట‌.

దీనికి కార‌ణ‌మేమిటో తెలిస్తే అంద‌రూ ఫ‌క్కున న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. అత‌డేమో పెద్ద స్టార్ సన్. త‌న రేంజు వేరే లెవ‌ల్. అందువ‌ల్ల ఎక్కువ స‌న్నిహితంగా మెలిగితే ఎట్నుంచి ఏం ముప్పు వ‌స్తుందోన‌ని, సెట్లో అంద‌రూ సందేహిస్తార‌ని త‌న‌కు డౌట్లు ఉన్నాయ‌ట‌. అదే విష‌యాన్ని ఆ హీరోయిన్ స‌ద‌రు స్టార్ హీరోకి కూడా చెప్పేసింది మ‌న‌సులో దాచుకోకుండా. అయితే అది విన్న త‌ర్వాత హ‌ర్ట‌యిన అత‌డు రెండు రోజుల పాటు త‌న‌తో మాట్లాడ‌ట‌మే మానేశాడ‌ట‌.

ఆ త‌ర్వాత వ‌న్ ఫైన్ డే త‌న‌ను పిలిచి హీరో- హీరోయిన్ సాన్నిహిత్యం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మేలు గురించి విశ‌ద‌ప‌రిచాడ‌ట‌. ఇద్ద‌రూ స్నేహితులుగా ఉంటే కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట‌వుతుంద‌ని, స‌న్నివేశాలు అద్బుతంగా కుదురుతాయ‌ని చెప్పాడ‌ట‌. అలా కాకుండా ఒక‌రికొక‌రు భేష‌జాల‌కు పోతే సీన్ స‌రిగా పండ‌ద‌ని కూడా అన్నాడ‌ట‌. అంతే అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రూ క‌లిసిపోయారు. ఎంతో గొప్ప స్నేహితులు అయ్యారు. ఆ సినిమా కూడా హిట్ట‌యింది.

ఈ జంట న‌డుమ రొమాంటిక్ సీన్ల‌కు, డ్యూయెట్ల‌కు అభిమానులు విజిల్స్ కూడా వేస్తారు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవ‌రు? ప్ర‌ముఖ హీరోయిన్ ఎవ‌రు? అంటే.. రామ్ చ‌ర‌ణ్ - త‌మ‌న్నా జంట గురించే ఇదంతా. ర‌చ్చ సినిమాలో తొలిసారి జంట‌గా న‌టించారు. మొద‌టి ప‌రిచ‌యం కాబ‌ట్టి త‌మ‌న్నా కొంత గంద‌ర‌గోళంలో ప‌డింది. స్టార్ స‌న్ తో క‌లిసిపోతే సెట్లో ఎవ‌రైనా ఏమైనా అనుకుంటారేమో అనేదే త‌న సందేహం. కానీ ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి న‌డుమా ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ అనంత‌రం గొప్ప స్నేహం వెలిసింద‌న్న‌మాట‌. మెగాస్టార్ వార‌సుడైనా కానీ రామ్ చ‌ర‌ణ్ ఏనాడూ ప‌రిమితి దాట‌డు. ఎంతో ఒదిగి ఉంటాడు. అంద‌రితో అంద‌రివాడుగా క‌లిసిపోవ‌డం త‌న ప్ర‌త్యేక‌త అని సెట్లో అంద‌రూ చెబుతారు.