Begin typing your search above and press return to search.

స్కిన్‌ షో తప్పే కాదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్‌

ఈ మధ్య కాలంలో తమన్నా యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.

By:  Tupaki   |   2 April 2024 10:30 AM GMT
స్కిన్‌ షో తప్పే కాదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్‌
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అవ్వబోతుంది. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్న మిల్కీ బ్యూటీ గత పుష్కర కాలంగా స్టార్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో తమన్నా యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.

సీనియర్‌ హీరోలకు జోడీగా, వెబ్‌ సిరీస్ ల్లో మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ తన అందాల ఆరబోత కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న తమన్నా గత ఏడాది చేసిన జైలర్ కావాలయ్యా ఐటెం సాంగ్ కి మంచి స్పందన వచ్చింది.

వయసు పెరుగుతున్న కొద్దీ మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఇంకా పెరుగుతుందా అన్నట్లుగా ఈ పాటలో ఆమెను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేశారు. సోషల్‌ మీడియాలో కొందరు ఆ పాటలో మిల్కీ బ్యూటీ డాన్స్ మూవ్స్‌ మరియు స్కిన్‌ షో పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మీమ్స్ క్రియేట్‌ చేశారు.

వాటిపై తమన్నా తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ గా కనిపించడం, ఐటెం సాంగ్స్ చేయడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం మాత్రమే అనే విషయం గుర్తించాలి. కమర్షియల్ సినిమాల్లో ముఖ్యంగా పాటల్లో గ్లామర్‌ గా కనిపించడం పెద్ద తప్పేం కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇలాంటి పాటల విషయంలో స్కిన్‌ షో విషయంలో ప్రేక్షకుల మైండ్ సెట్‌ మారాలి అంటూ తమన్నా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంకా కూడా ఒక మూస పద్దతిలో పాత తరహా వారిలా ఆలోచించడం కరెక్ట్‌ కాదని కొందరు ఆమెకు మద్దతుగా నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.