Begin typing your search above and press return to search.

ర‌జనీకాంత్ వ‌ర్సెస్ జ‌గ్గూ దాదా.. త‌మ‌న్నా హింట్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ స‌ర్.. అవ‌ర్ వెరీ వోన్ జ‌గ్గూ దాదా ఈ చిత్రం లో అద్భుతంగా న‌టించార‌ని త‌మ‌న్నా కీర్తించ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:58 AM GMT
ర‌జనీకాంత్ వ‌ర్సెస్ జ‌గ్గూ దాదా.. త‌మ‌న్నా హింట్
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'జైల‌ర్' ఆగ‌స్టు 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి వారం ముందు చిత్ర‌బృందం ప్ర‌చారంలో మ‌రింత వేడి పెంచుతోంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ లో ర‌జ‌నీ స్టైల్ కంటెంట్ గ్రిప్ గురించి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అత‌డి లో వాడి వేడి త‌గ్గ‌లేద‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఈ చిత్రం లో క‌థానాయిక‌గా న‌టించిన త‌మ‌న్నా భాటియా అటు హిందీ మీడియా లోను విస్త్ర‌తంగా ప్ర‌చారం చేస్తోంది.

ఓవైపు ప్రియుడు విజ‌య్ గురించి ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కొంటున్నా విసుక్కోకుండా జైల‌ర్ గురించి ప్ర‌మోష‌న్ చేస్తోంది మిల్కీ. తాజా ఇంట‌ర్వ్యూలో జైల‌ర్ గురించి ప్ర‌స్థావిస్తూ .. ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్ప‌ను కానీ ఇది రూట్స్ నుంచి పుట్టుకొచ్చిన సినిమా అని స్ప‌ష్ఠంగా చెప్ప‌గ‌ల‌ను! అంటూ వ్యాఖ్యానించింది. ద‌క్షిణాది రూట్స్ ఉన్న ఈ సినిమా తమిళం లో తెర‌కెక్కి తెలుగు-మ‌ల‌యాళం-క‌న్న‌డం - హిందీ లో విడుద‌ల‌వుతోంద‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది.

జైల‌ర్ లో అంద‌రూ దిగ్గ‌జాలు న‌టించారు. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి న‌ట‌విశ్వ‌రూపం చూపించారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ స‌ర్.. అవ‌ర్ వెరీ వోన్ జ‌గ్గూ దాదా ఈ చిత్రం లో అద్భుతంగా న‌టించార‌ని త‌మ‌న్నా కీర్తించ‌డం విశేషం.

న‌టీన‌టులు అంద‌రూ దిగ్గ‌జాలే:

ఈ చిత్రం లో రజనీ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ త‌న‌దైన మార్క్ ని చూపించారు. ర‌జ‌నీ మార్క్ ఫ‌న్ .. స్టైల్ .. యాక్ష‌న్ తో సినిమా ఆద్యంతం ర‌క్తి కట్టించ‌నుంద‌ని ఇంత‌కుముందు రిలీజైన ట్రైల‌ర్ వెల్ల‌డించింది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు ఇందులో జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ పాత్ర‌లు ఆక‌ట్టుకోనున్నాయి. క‌మెడియ‌న్ సునీల్ ఇందులో మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించారు.

సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. రీసెంట్గా విడుదలైన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన పాట యువ‌త‌రం లోకి దూసుకెళ్లింది. మూవీ నుంచి సింగిల్స్ సంగీతం ప‌రంగా ఎంతో ఆక‌ట్టుకున్నాయి.