Begin typing your search above and press return to search.

దివంగత హీరోయిన్‌ పాత్రలో మిల్కీ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 6:10 AM GMT
దివంగత హీరోయిన్‌ పాత్రలో మిల్కీ బ్యూటీ
X

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో అతి కొద్ది మంది మాత్రమే గుర్తింపు దక్కించుకుంటారు. అందులో కూడా కొంత మంది మాత్రమే స్టార్‌ హీరోయిన్స్‌ గా గుర్తింపును దక్కించుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్స్‌ లో దివ్య భారతి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

1980, 1990 కిడ్స్ కు దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే అప్పటి స్టార్‌ హీరోలందరితో కూడా సినిమాలు చేసిన ఘనత ఆమె దక్కించుకుంది. అలాంటి అరుదైన ఘనత ఆ తర్వాత అతి కొద్ది మందికి మాత్రమే దక్కింది. ఆమె హీరోయిన్‌ గా ఫుల్‌ ఫామ్‌ లో ఉన్న సమయంలోనే చనిపోయింది. ఆమె మరణం ఇప్పటికి కూడా అంతుపట్టని రహస్యం అన్నట్లుగా ఉంది.

తన అపార్ట్‌మెంట్‌ నుండి కింద పడి చనిపోయిన దివ్య భారతి కేసు సుదీర్ఘంగా సాగింది. మొదట భర్త పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ బాలీవుడ్‌ వర్గాల వారు మాత్రం ఇప్పటికి కూడా దివ్యభారతి మరణం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇప్పుడు దివ్య భారతి మరణం గురించి ఒక సినిమాను రూపొందించేందుకు గాను మలయాళ దర్శకుడు అరుణ్‌ గోపీ రెడీ అవుతున్నాడు. దిలీప్‌ హీరోగా మిలీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న బాంద్రా అనే సినిమా లో దివ్య భారతి కథ ను చూపించబోతున్నట్లుగా అధికారికంగానే చెబుతున్నారు.

బాంద్రా సినిమాలో దివ్యభారతి పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా ను చూడబోతున్నామని అక్కడి మీడియా కథనాలు రాస్తోంది. పాన్‌ ఇండియా గుర్తింపు ఉన్న దివ్య భారతి కథ కనుక బాంద్రా సినిమాను అన్ని భాషల్లో తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చూడని, తెలియని విషయాలను ఈ సినిమాలో ఏమైనా చెప్తారా అని దివ్య భారతి ని అభిమానించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.