Begin typing your search above and press return to search.

అప్ప‌టి నుంచి వ్యాక్సింగ్ ఆపేశా: త‌మ‌న్నా

ఈ సంద‌ర్భంగా మిల్కీ చెప్పిన ఓ సంగ‌తి హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:15 AM GMT
అప్ప‌టి నుంచి వ్యాక్సింగ్ ఆపేశా: త‌మ‌న్నా
X

త‌మ‌న్నా భాటియా పేరు ఇటీవ‌ల ర‌క‌ర‌కాల రాంగ్ రీజ‌న్స్ తో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్.. క్రికెట్ అన‌ధికారిక ఆన్ లైన్ స్ట్రీమింగ్ వ్య‌వ‌హారాల్లో త‌మ‌న్నా పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. పోలీసులు స‌మ‌న్లు పంపినా త‌న‌కు వారి ఎదుట హాజ‌ర‌య్యేందుకు ఇంకా స‌మ‌యం కావాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా న‌టించిన `బాక్` మూవీ మే 3న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మిల్కీ చెప్పిన ఓ సంగ‌తి హాట్ టాపిక్ గా మారింది.

తాను `హౌస్ ఆఫ్ వ్యాక్స్` అనే హాలీవుడ్ చిత్రం చూశాక‌.. వ్యాక్సింగ్ (ఒంటిపై రోమాల్ని తొల‌గించ‌డం) చేయించుకోవ‌డం మానేశాన‌ని త‌మ‌న్నా తెలిపారు. ఆ సినిమాలో వ్యాక్స్ (వెంట్రుక‌లు) తో అమ్మాయిల్ని ర‌క‌ర‌కాలుగా చంపేస్తార‌ని తెలిపింది. కార‌ణం ఏదైనా ఆ హాలీవుడ్ చిత్రం త‌మ‌న్నా మైండ్ పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్న‌ది నిజం. ఇక ఆన్ లైన్ లో వ్యాక్స్ రిమూవ‌ల్ కోసం ఉప‌యోగించే ఉత్ప‌త్తుల కోసం ప్ర‌ముఖ క‌థానాయిక‌లు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా చెప్పిన ఈ కొత్త విష‌యంతో యువ‌త‌రం ప్ర‌భావితం అవుతుందేమో చూడాలి.

త‌మ‌న్నా న‌టించిన బాక్ హార‌ర్ కామెడీ చిత్రం. త‌మిళంలో ఆర‌ణ్మ‌నై 4 గా రిలీజ‌వుతోంది. ఈ చిత్రానికి సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో త‌మ‌న్నాతో పాటు రాశీ ఖ‌న్నా ఒక క‌థానాయిక‌గా న‌టించింది. ఇటీవ‌లే ఈ జోడీపై ప్ర‌చార గీతం రిలీజ్ కాగా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్నాలోని గ్లామ‌ర్ యాంగిల్ ని ఈ సాంగ్ అద్భుతంగా ఎలివేట్ చేసింది. త‌మ‌న్నా త‌దుప‌రి మంచు విష్ణు క‌న్న‌ప్ప‌లో ఒక ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా స‌మాచారం రావాల్సి ఉంది.