Begin typing your search above and press return to search.

ఎవడ్రా తమన్నా పనైపోయింది అన్నది...!

హ్యాపీ డేస్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌ లోముందుకు సాగింది.

By:  Tupaki Desk   |   17 April 2024 4:32 AM GMT
ఎవడ్రా తమన్నా పనైపోయింది అన్నది...!
X

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు సినిమా శ్రీ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. హ్యాపీ డేస్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌ లోముందుకు సాగింది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో, ఎంతో మంది సూపర్ స్టార్స్ తో తమన్నా నటించి మెప్పించింది.


ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా కు కాస్త తక్కువ ఆఫర్లు వస్తుండటంతో తమన్నా పనైపోయింది అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఏ హీరోయిన్ అయినా పదేళ్లు ఇండస్ట్రీలో బిజీగా ఉంటే గొప్ప విషయం. కానీ తమన్నా రెండు దశాబ్దాలుగా ఉంటుంది.

ఇన్నాళ్లు ఆమెకు సినిమాల్లో ఆఫర్లు రావడం గొప్ప విషయం. ఇక ఆమె సైలెంట్‌ గా సైడ్ అయ్యి ఫ్యామిలీ లైఫ్‌ లో సెటిల్‌ అయితే మంచిది అంటూ కొందరు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ తమన్నా మాత్రం వాటిని పట్టించుకోకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతూనే ఉంది.

ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూ మరో వైపు వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ వచ్చింది. చివరకు మ్యూజిక్‌ వీడియోస్ లో కూడా తమన్నా కనిపించింది. తాజాగా ఈ అమ్మడికి మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్‌ తో తమన్నా మరో అయిదేళ్ల కెరీర్‌ ను కంటిన్యూ చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వివరాల్లోకి వెళితే... ఎంఎస్‌ ధోనీ, రుస్తుం, టాయిలెట్‌, వంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి కమర్షియల్ గా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు నీరజ్ పాండే ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ కోసం వర్క్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే ది ఫ్రీలాన్సర్‌ వంటి వెబ్‌ సిరీస్‌ తో మెప్పించిన నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త వెబ్‌ సిరీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ముంబయిలో జరిగే క్రైమ్‌ కథతో ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ వెబ్‌ సిరీస్ ను పూర్తి చేయబోతున్నారు. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ గురించి మరిన్ని వివరాలు తెలియజేయబోతున్నారట.

ప్రతిష్టాత్మక నీరజ్ పాండే వెబ్‌ సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లు మా తమన్నా పనైపోయిందంటూ విమర్శించిన వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కూడా తమన్నా బిజీ అవ్వడం ఖాయం అని వారు ధీమాతో కనిపిస్తున్నారు.