Begin typing your search above and press return to search.

బ్లాక్ టైట్ ఫిట్ లో తమన్నా హై గ్లామర్ డోస్.!

బ్లాక్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. డ్రెస్ కి అస్సలు సంసబంధం లేకుండా గోల్డ్ కలర్ చెవి పోగులు ధరించింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:11 AM GMT
బ్లాక్ టైట్ ఫిట్ లో తమన్నా హై గ్లామర్ డోస్.!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తెలియనివారు ఎవరూ ఉండరు. ఆమె దశాబ్దకాలంగా గ్లామరస్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతోంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ నటించింది. రీసెంట్ గా బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ఆమె చాలా కాలం క్రితం హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నించింది. కానీ, ఆ సినిమాలు క్లిక్ కాకపోవడంతో మళ్లీ దక్షిణాదిన సినిమాలు చేసింది.


కానీ, రీసెంట్ గా బాలీవుడ్ లో వరసగా వెబ్ సిరీస్ లు చేయడం మొదలుపెట్టింది. ఒక దాని తర్వాత మరొకటి ఆమెకు ఆఫర్ల క్యూలు కడుతున్నాయి. జీ కర్దా, లస్ట్ సోరీస్2 వంటి వెబ్ సిరీస్ లలో అందాలు ఆరబోసింది. ఇప్పటి వరకు తన ఫిల్మ్ కెరీర్ లో నో లిప్ లాక్ ఫార్ములా ఫాలో అవుతూ వచ్చింది. కానీ, ఆ ఫాలసీని ఈ వెబ్ సిరీస్ లతో బ్రేక్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2లో తన ప్రియుడు విజయ్ వర్మతో మొదటిసారి లిప్ లాక్ ఇచ్చింది.


ఇక, రీసెంట్ గా రజినీకాంత్ జైలర్ మూవీలో నటించింది. అందులో ఆమె రియల్ హీరోయిన్ రోల్ చేసింది. సినిమాలో నిడివి చాలా తక్కువ. కానీ, ఆమె చేసిన పాట మాత్రం సినిమాకు బ్లాక్ ప్లస్ అయ్యింది. ఆ ఒక్కపాటలో అయినా, తన అందాలతో ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో, ఈ చిత్ర బృందం తాజాగా జైలర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ లో తమన్నా కూడా పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. బ్లాక్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. డ్రెస్ కి అస్సలు సంసబంధం లేకుండా గోల్డ్ కలర్ చెవి పోగులు ధరించింది. ఇక, జుట్టు మొత్తం వెనక్కి దువ్వేసి వెనక, ముడివేసింది. ఈ లుక్ కొత్తగా ఉండటంతో, ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం తమన్నా ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆఖరి సచ్ అనే వెబ్ సిరీస్ మాత్రమే ఆమె చేతిలో ఉంది. ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కాగా, రియల్ ఎన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించడం విశేషం.