Begin typing your search above and press return to search.

భోళా ఈవెంట్ కి రాని తమన్నా, కారణం ఇదే..!

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్ ముంబయిలో మొట్టమొదటి సారిగా సెలూన్ ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 6:49 AM GMT
భోళా ఈవెంట్ కి రాని తమన్నా, కారణం ఇదే..!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. మరో మూడు రోజుల్లో ఈ భోళా శంకరుడు థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. కాగా, మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, చిత్ర బృందం నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది.

చిరంజీవి, కీర్తి సురేష్ , సుశాంత్ అందరూ హాజరయ్యారు. అయితే, తమన్నా లేని లోటు స్పష్టంగా కనపడింది. తమన్నా కూడా హాజరై ఉండి ఉంటే, షోకి మరింత గ్లామర్ వచ్చి ఉండేది. కానీ, తమన్నా ఎందుకు రాలేదా అనే చర్చ మొదలైంది.

ఆమె రాకపోవడానికి కారణం ఉందట. కరెక్ట్ గా భోళా శంకర్ ఈవెంట్ సమయంలో ఆమె ముంబయిలో మరో ఈవెంట్ లో హాజరుకావాల్సి వచ్చిందట.

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్ ముంబయిలో మొట్టమొదటి సారిగా సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందుకే భోళా శంకర్ ఈవెంట్ కి తమన్నా రాలేకపోయారు. అయితే, ఆ ఈవెంట్ లో తమన్నా బ్లాక్ కలర్ సూట్ లో మెరిసిపోయింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇక,ఈ భోళా శంకర్ మూవీ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో అన్నా, చెల్లెళ్ల సెంటిమెంట్ ని హైలెట్ గా చూపించనున్నారు. కీర్తి సురేష్, చిరంజీవి కి చెల్లిలిగా కనిపించనుంది. ఇక ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీ తర్వాత చిరు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన చిరంజీవి పుట్టినరోజు నాడు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.