Begin typing your search above and press return to search.

తమన్నా-రాశి.. గ్లామర్ యుద్ధం

‘ఆరణ్మయి-3’లో రాశి ఖన్నాను చాలా గ్లామరస్‌గా చూపించి యూత్‌ను మెప్పించాడు సుందర్. ‘ఆరణ్మయి-4’లోనూ రాశి పాత్రను కొనసాగిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   15 March 2024 4:30 PM GMT
తమన్నా-రాశి.. గ్లామర్ యుద్ధం
X

ఆరణ్మయి.. తమిళంలో ఫ్రాంఛైజీగా మారిన హార్రర్ కామెడీ మూవీ. తెలుగులో ఎప్పుడో అరగదీసి పక్కన పడేసిన ఈ జానర్‌ను తమిళ దర్శకులు మాత్రం ఇంకా వదిలిపెట్టట్లేదు. ముఖ్యంగా సీనియర్ దర్శకుడు సుందర్.సి అయితే చాలా ఏళ్లుగా ఈ ఫ్రాంఛైజీని నమ్ముకునే కెరీర్‌ను సాగదీస్తున్నాడు. ‘ఆరణ్మయి’ హిట్టయినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ కూడా గొప్ప ఫలితాలేమీ అందుకోలేదు.

కానీ సుందర్ మాత్రం అవే కథలను ఇటు అటు తిప్పి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ‘ఆరణ్మయి’ ఫ్రాంఛైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. నాలుగో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ వేసవిలోనే రిలీజ్ పెట్టుకున్నారు. ఈ సినిమాల్లో హార్రర్, కామెడీతో పాటు గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంటోంది. ఈ సినిమాలు సేల్ కావడానికి కూడా అదే కారణం.

‘ఆరణ్మయి-3’లో రాశి ఖన్నాను చాలా గ్లామరస్‌గా చూపించి యూత్‌ను మెప్పించాడు సుందర్. ‘ఆరణ్మయి-4’లోనూ రాశి పాత్రను కొనసాగిస్తున్నాడు. ఆమెకు తోడు మిల్కీ బ్యూటీ తమన్నాను కూడా రంగంలోకి దించాడు సుందర్. వీళ్లిద్దరి గ్లామర్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు సెక్సీగా కనిపిస్తున్న ఒక పోస్టర్ యూత్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. రాశి, తమన్నా ఇద్దరి కెరీర్లూ ఇప్పుడు డల్లుగా నడుస్తున్నాయి.

ఇంతకుముందుతో పోలిస్తే వారి రేంజ్ పడిపోయింది. మిడ్ రేంజ్ సినిమాలక పరిమితం అవుతున్నారు. అయినా ఇప్పుడున్న రేంజ్ ఇంకా తగ్గకుంటే చాలన్నట్లు ఉంది పరిస్థితి. అందుకే ‘ఆరణ్మయి-4’ లాంటి సినిమాలు క్లిక్ అవడం కీలకం. సినిమాలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి గ్లామర్ విందు చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమాకు వారి గ్లామర్ ఏమేర ప్లస్ అవుతుందో చూడాలి.