Begin typing your search above and press return to search.

తమన్నా..రాశీ.. ఓకే ఫ్రేమ్ లో స్టన్నింగ్ గ్లామర్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తమన్నా తో పాటు రాశీ ఖన్నా అల్ట్రా గ్లామర్ గా కనిపిస్తున్నారు. స్టైలిష్ ఔట్ ఫిట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2024 11:22 AM GMT
తమన్నా..రాశీ.. ఓకే ఫ్రేమ్ లో స్టన్నింగ్ గ్లామర్
X

సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో జోనర్ లో ఒక్కో సిగ్నేచర్ స్టైల్ ఉంటోంది. ఈ విధంగానే కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్.సి హారర్ సినిమాలను తెరకెక్కించి అలరిస్తుంటారు. అలా అని ఆయనే కేవలం ఆ జోనర్ చిత్రాలే తీయరు. కానీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టినవి మాత్రం అవే. వీటితోపాటు గ్లామర్ కమర్షియల్ మూవీలు కూడా తెరకెక్కించి హిట్లు కొడుతుంటారు. తన కథ కోసం ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లను ఎంచుకుంటుంటారు.

ప్రముఖ నటి ఖుష్బూ భర్త అయిన సుందర్.. ప్రస్తుతం అరణ్మనై 4 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ.. వచ్చే నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామలు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఎప్పుడూ ఫుల్ గ్లామర్ తో అలరించే ఈ భామలు.. సినిమాలో దెయ్యాలుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్ లో తమన్నాను దెయ్యంగా చూపించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తమన్నా తో పాటు రాశీ ఖన్నా అల్ట్రా గ్లామర్ గా కనిపిస్తున్నారు. స్టైలిష్ ఔట్ ఫిట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నారు. ఎద అందాలతో కవ్విస్తున్నారు. ఓ స్పెషల్ సాంగ్ షూట్ కు సంబంధించిన పిక్ గా అర్థమవుతోంది. బ్యూటీల స్టన్నింగ్ అందాలకు నెటిజన్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.

అయితే తెలుగులో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో, ఏ పేరుతో విడుదలవ్వనుందో ఇంకా తెలియలేదు. కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాశి, తమన్నా గ్లామర్ షో కోసం వెయిటింగ్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే నార్మల్ గా సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి గ్లామర్ షో మాములుగా ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక 2014 లో అరణ్మనై ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించారు సుందర్. హన్సిక, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం.. తెలుగులో చంద్రకళ పేరుతో రిలీజై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత అరణ్మనై 2లో త్రిష, హన్సిక నటించగా.. కళావతి పేరుతో మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. మూడేళ్ల క్రితం అరణ్మనై 3 తెలుగులో అంతఃపురం పేరుతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ అందుకుంది. మరి ఇప్పుడు నాలుగో భాగాన్ని సుందర్ ఏ పేరుతో రిలీజ్ చేస్తారో చూడాలి.