Begin typing your search above and press return to search.

అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు?

ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా ట్రోల్స్ పై స్పందించింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:06 AM GMT
అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు?
X

మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడు చూసినా బిజీగానే అనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఈమెకు ఆఫర్లు కొదవ లేదు. కానీ ఈమెకు వస్తున్న ఆఫర్లు మాత్రం ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొనే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా గతంలో మాదిరిగా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించడం లేదు.

తాజాగా తమన్నా జైలర్ మరియు భోళా శంకర్ సినిమాల్లో నటించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ కి భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించింది. కనుక తమన్నా పాత్ర ఏంటో ఊహించుకోవచ్చు. ఇక భోళా శంకర్‌ అన్న చెల్లి అనుబంధంకు సంబంధించిన చిత్రం. కనుక భోళా శంకర్ లో కూడా తమన్నా పాత్ర పాటలకే పరిమితం అయ్యే విధంగా ఉంటుందనే టాక్‌ ఉంది.

పైగా ఈ రెండు సినిమాల హీరోల వయసు ఆరు పదులకు పైగానే ఉంటుంది. కనుక సీనియర్ హీరోలకు మాత్రమే తమన్నా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా ట్రోల్స్ పై స్పందించింది. కొందరు ఎందుకు హీరోల వయసు గురించి మాట్లాడుతున్నారు. వారి పాత్రలను కదా చూడాల్సింది అంటూ సమాధానం ఇచ్చింది.

తాను హీరోల వయసు గురించి ఎప్పుడు ఆలోచించను. నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండటంతో పాటు ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్‌ టైన్ చేస్తానా అనే యాంగిల్‌ లోనే సినిమాలను చేస్తాను. అందుకే తాను వచ్చిన ఆఫర్లలో ఎక్కువ శాతం సినిమాలు చేసేందుకు ఓకే చెప్తాను అంది. అంతే కాకుండా హాట్ బ్యూటీ తమన్నా ముందు ముందు కూడా సీనియర్ హీరోలతో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది.

మిల్కీ బ్యూటీ తమన్నా కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే నటించకుండా ఐటం సాంగ్స్ చేస్తోంది... ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ ఉందడి చేస్తోంది. ఇక వరుసగా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంది. తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్‌ సిరీస్ లో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.