Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా సైలెంట్ గా పేల్చేసిందే!

ఇక అమ్మ‌డు సినీ ప్ర‌పంచంలో కి అడుగు పెట్టి కూడా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   7 March 2024 8:22 AM GMT
త‌మ‌న్నా సైలెంట్ గా పేల్చేసిందే!
X

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కొన్నాళ్ల‌గా అన్ని భాష‌ల్ని క‌లిపి దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. హిందీ.. తెలుగు.. మ‌ల‌యాళం..త‌మిళం అంటూ ఏ భాష‌లో ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా నో చెప్ప‌కుండా ముందుకె ళ్లిపో తుంది. ఐట‌మ్ సాంగ్ అయినా..హీరో ఛాన్స్ అయినా..గెస్ట్ అప్పిరియ‌న్స్ అయినా తేడా లేకుండా మార్కెట్ లో మురిపిస్తుంది. ఇక అమ్మ‌డు సినీ ప్ర‌పంచంలో కి అడుగు పెట్టి కూడా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల జ‌ర్నీలో ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.

త‌మ‌న్నా అంటే కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు అంత‌కు మించి ఆటం బాంబ్ లో పెలుతుంద‌ని సైతం ఎన్నో పాత్ర‌ల‌తో రుజువు చేసింది. అమ్మ‌డు బోల్డ్ అటెంప్ట్ తోనూ ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీని సంపాదించు కుంది. తాజాగా అమ్మ‌డు హిందీలో ఓ న‌యా ఛాన్స్ అందుకుంది అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నీరజ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది.

గ‌త నెల‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. అన్ని ప‌నులు పూర్తి చేసి ఇదే ఏడాది ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. త‌మ‌న్నా కూడా షూటింగ్కి హాజ‌ర‌వుతుందిట‌. అయితే ఈ విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ ఏ మీడియా లోనూ తెర‌పైకి రాలేదు. త‌మ‌న్నా కూడా నీర‌జ్ పాండేతో సినిమా చేస్తున్న విష‌యాన్ని ఎ క్క‌డా రివీల్ చేయ‌లేదు. అంతా గోప్యంగా ఉంచి ఒక్క‌సారిగా ఇలా అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసింది.

అలాగే 'స్త్రీ 'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న 'స్త్రీ-2' లో కూడా త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇక తెలుగులో 'ఓదెల రైల్వేస్టేష‌న్ -2' లోనూ న‌టిస్తోంది. ఆ ర‌కంగా అమ్మ‌డు ఒకేసారి రెండు సీక్వెల్స్ లో ప‌నిచేయ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. ఇంకా అమ్మ‌డికి కొత్త అవ‌కాశాలు బాగానే వ‌రిస్తున్నాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు త‌మ‌న్నాతో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.