Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా ఖాళీ అయిపోయింద‌నుకుంటే?

అటు త‌మిళంలో 'ఆర‌ణ్మ‌నై 4'లో న‌టిస్తోంది..బాలీవుడ్ లో 'వేద'లో జాన్ అబ్ర‌హాంతో న‌టిస్తోంది. స్పెష‌ల్ ఓపిఎస్ ఫేం నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఒక మూవీ చేస్తోంది.

By:  Tupaki Desk   |   7 March 2024 6:19 PM GMT
త‌మ‌న్నా ఖాళీ అయిపోయింద‌నుకుంటే?
X

చాలా కాలంగా త‌మ‌న్నా భాటియా తెలుగు చిత్ర‌సీమ‌కు దూరంగా ఉంది. ఓవైపు త‌మిళంలో న‌టిస్తూనే, అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతోంది. పైగా న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ లో ఉన్న‌ప్ప‌టి నుంచి పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది.

త‌మ‌న్నా కెరీర్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది! అనే రూమ‌ర్లు పుట్టుకొచ్చిన క్ర‌మంలో వెంట‌నే త‌న కంబ్యాక్ ని ఘ‌నంగా చాటుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. త‌మ‌న్నా ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. అటు త‌మిళంలో 'ఆర‌ణ్మ‌నై 4'లో న‌టిస్తోంది..బాలీవుడ్ లో 'వేద'లో జాన్ అబ్ర‌హాంతో న‌టిస్తోంది. స్పెష‌ల్ ఓపిఎస్ ఫేం నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఒక మూవీ చేస్తోంది. ఇత‌ర ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలిసింది. మ‌రోవైపు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే అవ‌కాశాల్లేక‌పోవ‌డం నిరాశ‌ప‌రుస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. తమన్నా భాటియా ట్యాలెంటెడ్ నీరజ్ పాండే తదుపరి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం సంతకం చేసే పనిలో ఉన్నారు. అటు హిందీ.. ఇటు సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య బ్యాలెన్స్ చేసేందుకు త‌మ‌న్నా ప్లాన్ చేస్తోంది. అలాగే స్పెషల్ ఆప్స్ తారాగణం నుండి మేల్ న‌టుడిని ఎంపిక చేయాల‌ని చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మిగిలిన స్టార్ కాస్ట్ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ సినిమా ఇప్పటికే చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభమైంది. ఈ సంవత్సరం చివరిలో విడుదలవుతుంది. ఇది థియేటర్లలో విడుదల కాదు .. పాపుల‌ర్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శిత‌మ‌వుతుంది. నిజానికి సెట్స్‌లో జామర్‌లు ఉన్నాయి.. దాని వ‌ల‌న‌ లోపల ఎవరూ ఏమీ షూట్ చేయలేరు లేదా కమ్యూనికేట్ చేయలేరు.