Begin typing your search above and press return to search.

వీడియో : మేకప్‌ లేకున్నా మిల్కీ బ్యూటీ అదుర్స్‌

కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం మేకప్‌ తో, మేకప్‌ లేకుండా కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 6:15 AM GMT
వీడియో : మేకప్‌ లేకున్నా మిల్కీ బ్యూటీ అదుర్స్‌
X

మిల్కీ బ్యూటీ తమన్నా నేచురల్‌ బ్యూటీ అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. కొందరు హీరోయిన్స్ మేకప్ లేకుండా బయటకు రావడం అనేది జరగదు. ఒక వేళ వారు మేకప్‌ లేకుండా బయటకు వస్తే కనీసం గుర్తించడం కూడా కష్టం అన్నట్లుగా వారు ఉంటారు.

కొందరు హీరోయిన్స్ మేకప్ తో ఒక మాదిరిగా, మేకప్‌ లేకుండా మరోలా అనిపిస్తూ ఉంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం మేకప్‌ తో, మేకప్‌ లేకుండా కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. తమన్నా తాజాగా ఎయిర్ పోర్ట్‌ లో మేకప్‌ లేకుండా కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసింది.

సింపుల్‌ పంజాబీ డ్రెస్ లో మేకప్‌ లేకుండా, లూజ్‌ హెయిర్‌ స్టైల్‌ తో మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంది. ఇంత సింపుల్ గా ఉన్నా కూడా చాలా అందంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ వీడియో కు తెగ కామెంట్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో సింగిల్‌ గా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మిల్కీ బ్యూటీ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ మధ్య తమన్నా కెరీర్‌ ఖతం అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ తాను ఇంకా ఫామ్‌ లో ఉన్నాను అంటూ గత ఏడాది జైలర్ మరియు భోళా శంకర్ సినిమాల్లో నటించడం ద్వారా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు కూడా మిల్కీ బ్యూటీ రెండు మూడు సినిమాల్లో చేస్తూ వెబ్‌ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరో పదేళ్ల పాటు కూడా మిల్కీ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా కొనసాగడం ఖాయం అని.. ఆమె అందం ఏమాత్రం తగ్గదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ అమ్మడు నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.