Begin typing your search above and press return to search.

ఆమెతో నాకు ఏ సమస్య రాలేదు..!

వంద కోట్లకు పైగా వసూళ్లు చేసిన అరణ్మనై సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తమన్నా మీడియా ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 1:30 PM GMT
ఆమెతో నాకు ఏ సమస్య రాలేదు..!
X

మిల్కీ బ్యూటీ తమన్నా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తమిళ సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీ అయిన అరణ్మనై 4 లో రాశి ఖన్నా తో కలిసి తమన్నా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు చేసిన అరణ్మనై సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తమన్నా మీడియా ముందుకు వచ్చింది.

రాశి ఖన్నా తో కలిసి వర్క్ చేయడం పై మిల్కీ బ్యూటీ స్పందించింది. సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించడం వల్ల ఏదో ఒక విషయంలో సమస్యలు వస్తాయి. కానీ నాకు మాత్రం రాశి ఖన్నా తో ఎలాంటి సమస్య రాలేదు అంటూ తాజా ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది.

ఇంకా తమన్నా మాట్లాడుతూ... ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రేక్షకులు వారి ఇద్దరి నటనను పోల్చుతూ చూస్తారు. అలా పోలిక ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందు నుంచి ఇద్దరం కూడా చాలా కష్టపడి వర్క్ చేశాం. ఒకరికొకరం చర్చించుకుంటూ నటించాం.

ఇద్దరిలో కూడా బాగా నటించాలనే తపన పెరిగింది. అరణ్మనై లో నేను మరియు రాశి కలిసి ఒక పాటలో కనిపించాం. ఆ పాటలోని డాన్స్ స్టెప్స్ ను పోటా పోటీగా వేసేందుకు ప్రయత్నించాం. అందుకే ఇద్దరి కాంబో కు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా మా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు వచ్చిన అరణ్మనై నాలుగు పార్ట్‌ లు కూడా మంచి విజయలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ లో అయిదవ భాగం త్వరలోనే మొదలు పెట్టే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తెలుగు లో అరణ్మనై ను 'బాక్‌' గా విడుదల చేశారు.

టాలీవుడ్‌ కి చెందిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల కారణంగా బాక్ కి మంచి పబ్లిసిటీ దక్కింది. కానీ వసూళ్ల విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను లైట్‌ తీసుకున్నట్లుగా అనిపించింది. తమిళనాట మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.